Chiranjeevi Director Vamsy: గుక్క పెట్టి ఏడుస్తున్న చిరంజీవి, ఓదార్చుతున్న స్టిల్స్ ఫోటోగ్రాఫర్..సీన్ చూసి షాక్ లో వంశీ

Director Vamsi Shocked By Chiranjeevi Rehearsals Details, Director Vamsi, Manchu Pallaki, Heroine Suhasini, Manchu Pallakir Movie Climax, Chiranjeevi Crying Scene, Tollywood, Interesting Facts

మంచు పల్లకి సినిమా షూట్ విరామం లేకుండా జరుగుతుంది.చిరంజీవి, సుహాయిని హీరో హీరోయిన్స్ నటిస్తున్నారు.

 Director Vamsi Shocked By Chiranjeevi Rehearsals Details, Director Vamsi, Manchu-TeluguStop.com

క్లైమాక్స్ చిత్రీకరణ ఒక్కటే పెండింగ్ ఉంది.అందుకోసం అంత సిద్ధం చేసుకొని గదిలో ఉన్న చిరంజీవి ని పిలవాడనికి డైరెక్టర్ వంశీ వెళ్లాల్సి ఉంది.

ఈ సీన్ లో సుహాసిని మరణిస్తుంది ఆమెను చూసి గుక్క పెట్టి ఏడుస్తూ గీత గీత అంటూ సీన్ ని రక్తి కట్టించాలి.సీన్ అంత కూడా ముందే చిరంజీవికి వివరించారు.

అల్ ఒకే.చిరు ని షాట్ సిద్ధంగా ఉంది అని చెప్పడానికి డైరెక్టర్ వంశీ అయన ఉన్న గదికి వెళ్లారు.అక్కడికి వెళ్లేసరికి చిరంజీవి బాగా ఏడుస్తున్నారు.

అయన ఏడుపు చూసి ఒక్కసారి గా వంశీ షాక్ అయ్యి అడుగు ముందుకు కానీ వెనక్కి కానీ వేయలేకపోతున్నారు.

అయన వేసుకున్న తెల్ల చొక్కా కన్నీళ్లతో తడిచిపోయింది.ఎందుకు ఏడుస్తున్నారో అనే విషయం వంశీకి ఎంత ఆలోచించిన అర్ధం కావడం లేదు.పోనీ దగ్గరకు వెళ్లి అడుగుదామా అంటే ఎందుకో తెలియని ఒక భయం.ఓవైపు అక్కడ చిరంజీవి గారిని ఓదారుస్తూ స్టిల్ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నాడు.ఊరుకోండి సర్ ఊరుకోండి కష్టాలు అంటే మనుషులకే వస్తాయి అంటూ చిరంజీవి తలపై చెయ్యి వేసి నిమురుతున్నాడు.అయినా కూడా ఇంకా ఎక్కువగా ఏడుస్తున్నాడు చిరంజీవి.కాసేపు ఆలా ఏడ్చాక తల పై ఉన్న ఆ ఫోటో గ్రాఫర్ చెయ్యి విసిరేసాడు.అస్సలే క్లైమాక్స్ లో ఎలా ఏడవాలో అని నేను రిహార్సల్ చేస్తూనే నువ్వెంటి రా మధ్యలో అంటూ గయ్యిమన్నాడు.

Telugu @iamchiranjeevi, Vamsi, Suhasini, Manchupallakir, Manchupallaki, Tollywoo

అప్పుడు కానీ అర్ధం కాలేదు.చిరంజీవి గారు క్లైమాక్స్ కోసం రిహార్సల్ చేస్తున్నారని.ఇక ఊపిరి పీల్చుకున్నాడు వంశీ.మొత్తానికి ఆ సీన్ చూసి అందరు చాల మెచ్చుకున్నారు.

అప్పటి వరకు చిరు అంటే కేవలం ఫైట్స్, డ్యాన్స్ అని మాత్రమే అనుకునేవారు.గట్టి ఎమోషన్ సీన్ చేయడం అదే మొదటి సారి.

కానీ జనాలకు క్లైమాక్స్ ఆలా ఉండటం నచ్చలేదు.దాంతో మంచు పల్లకి సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఆ తర్వాత డైరెక్టర్ వంశీ కోకిల సినిమా చేసి మంచి హిట్ అందుకున్నారు.ఇక ఈ సినిమాలో సుహాసిని కి డబ్బింగ్ చెప్పింది హీరోయిన్ సరితా .అప్పట్లో ఆమె ఒక మూవీ కి డబ్బింగ్ చెప్పడానికి పదివేలు రెమ్యునరేషన్ తీసుకునేవారు.ఈ సినిమాకు దర్శకత్వం చేయడానికి డైరెక్టర్ వంశీకి నెలకు 650 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు.

ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో అవికూడా ఇవ్వలేదు నిర్మాత.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube