అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు రామలింగయ్య శతజయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించారు.అక్టోబర్ ఒకటవ తేదీ ఈయన శతజయంతి కావడంతో అల్లు కుటుంబ సభ్యులు ఆయన పేరు మీదుగా నిర్మించిన అల్లు స్టూడియోస్ ను ఎంతో ఘనంగా ప్రారంభం చేశారు.

 Director Trivikram Who Got Allu Ramalingaiah National Award Details, Allu Ramali-TeluguStop.com

మెగాస్టార్ చేతుల మీదుగా ఈ స్టూడియోస్ ప్రారంభం చేశారు.ఇకపోతే అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన పేరు మీదుగా బుక్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అల్లు కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అలాగే మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని ప్రకటించారు.ఈ క్రమంలోనే ఈ పురస్కారాన్ని టాలీవుడ్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందుకున్నారు.

వేదికపై అల్లు అర్జున్ స్వయంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్వర్ణ కంకణం తొడిగి సత్కరించారు.

ఇకపోతే ఇదివరకు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని నటుడు కోటా శ్రీనివాసరావు దర్శకుడు కే రాఘవేంద్రరావు వంటి వారు అందుకున్నారు.ఇక ఈ ఏడాది ఈ పురస్కారం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దక్కింది.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు టాలీవుడ్ సీనియర్ కమెడియన్లు కూడా పాల్గొని అల్లు రామలింగయ్యతో వారికున్న అనుబంధం గురించి తెలియజేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube