Director Teja: తెలుగమ్మాయిలకు అది తక్కువ అందుకే అవకాశాలు రావట్లేవు.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ తేజ?

మామూలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు తెలుగు హీరోయిన్లను( Telugu Heroines ) అస్సలు పట్టించుకోరు.అన్ని విధాలుగా టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్లను తక్కువ చూపు చూస్తూ ఉంటారు.

 Director Teja Shocking Comments On Telugu Heroines-TeluguStop.com

ఇక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ హీరోయిన్ లకు మాత్రం పిలిచి మరి అవకాశాలు ఇస్తూ ఉంటారు.ఇక తెలుగు హీరోయిన్లు ఇక్కడ అవకాశాలు అందుకోలేక.

ఇతర ఇండస్ట్రీలోకి వెళ్లలేక.చచ్చినట్లు ఇక్కడే చిన్న చిన్న సినిమాలు, సిరీస్ లు చేస్తూ కెరీర్ ను ముందుకు నడిపిస్తూ ఉంటారు.

కానీ ఇతర భాషలకు చెందిన హీరోయిన్లు మాత్రం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ల స్థానంలో దూసుకుపోతున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో( Tollywood ) గమనిస్తే.తెలుగు అమ్మాయిలు ఎక్కడో దూరాన ఉండగా.ఇతర భాషకు చెందిన అమ్మాయిలు మాత్రం నెత్తిన కూర్చున్నారని చెప్పాలి.

ఇక తెలుగు అమ్మాయిలు అవకాశాల కోసం బాగా ఆరాటపడుతూ ఉంటారు.మంచి సక్సెస్ అందించే సినిమా చేస్తే చాలు అని బాగా ప్రయత్నిస్తూ ఉంటారు.

పైగా అందాలు కూడా బయట పెట్టటానికి సిద్ధంగా ఉన్నారు.

Telugu Abhiram, Ahimsa, Teja, Teja Ahimsa, Telugu, Tollywood-Movie

ఇప్పటికే పలువురు తెలుగు హీరోయిన్లు.తమపై దర్శక నిర్మాతల దృష్టిపడాలి అని సోషల్ మీడియాలలో బాగా హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు.కానీ దర్శకులు మాత్రం అస్సలు పట్టించుకోవడం లేరు.

అయితే తాజాగా డైరెక్టర్ తేజ( Director Teja ) తెలుగు హీరోయిన్ల గురించి ఒక షాకింగ్ కామెంట్ చేశాడు.తాజాగా ఈయన దగ్గుబాటి అభిరామ్ తో చేసిన అహింస సినిమా( Ahimsa Movie ) విడుదల అయింది.

కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

Telugu Abhiram, Ahimsa, Teja, Teja Ahimsa, Telugu, Tollywood-Movie

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు.అందులో భాగంగా హోస్ట్ డైరెక్టర్ తేజను.ఎందుకు తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు రావట్లేవు.

ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించాడు.దీంతో డైరెక్టర్ తేజ స్పందిస్తూ.

తెలుగు అమ్మాయిలకు సహనం చాలా తక్కువ అని.ఆరు నెలలు ఆగండి.సినిమా అవకాశాలు వస్తాయి అని చెప్పే లోపే వాళ్లు వేరే కమిట్మెంట్ ద్వారా ముందుకెళ్ళిపోతున్నారని.అయితే అది వాళ్లకున్న ఇబ్బందుల కారణంగా కావచ్చు కొందరు బలవంతం చేయడం కారణంగా కావచ్చు.

Telugu Abhiram, Ahimsa, Teja, Teja Ahimsa, Telugu, Tollywood-Movie

అందుకే తెలుగు ఇండస్ట్రీలో అమ్మాయిలు అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు అని కాస్త కౌంటర్ వేసే విధంగా స్పందించాడు.దీంతో ఈయన మాట్లాడిన విని తెలుగు అమ్మాయిలు బాగా ఫైర్ అవుతున్నారు.పక్క భాషకు చెందిన అమ్మాయిల కోసమైతే కథలు రెడీగా ఉంటాయి.అదే తెలుగమ్మాయిలు చూస్తే మాత్రం ఆ కథలకు ఓకే చేయరు అంటూ ఘాటుగా సమాధానాలు ఇస్తున్నారు.

ఇక ఏదేమైనా టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది తీరని కల అని కొందరు అంటున్నారు.కానీ మరి కొంతమంది.వాళ్ళు గట్టిగా అనుకుంటే మాత్రం స్టార్ హీరోయిన్ లను మించిపోతారు అంటూ సపోర్టుగా మాట్లాడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube