దర్శకుడు సాయి రాజేష్( Director Sai Rajesh ) గురించి మనందరికీ తెలిసిందే.గత ఏడాది బేబీ సినిమాతో( Baby Movie ) ఒకసారిగా పాపులారిటీ సంపాదించుకున్నారు సాయి రాజేష్.
వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ శెట్టిగా నిలిచింది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంతోపాటు అటు దర్శకుడికి ఇటు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో దర్శకుడు సాయి రాజేష్ కి సంబంధించిన ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే దర్శకుడు సాయి రాజేశ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఏం జరిగింది సాయి రాజేష్ పై ఫిర్యాదు ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అన్న వివరాల్లోకి వెళితే.2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయాలని శ్రీరామ్‌ను సాయిరాజేశ్ నీలంను కోరారట.2015లో శ్రీరామ్ కన్నా ప్లీజ్ టైటిల్‌తో రాసుకున్న కథకు తరువాత ప్రేమించొద్దు( Preminchoddu ) అని టైటిల్ పెట్టారట.సాయి రాజేశ్ సూచనతో నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడు గాదెకు కథను వినిపించారట.

2023లో సాయిరాజేశ్ నీలం దర్శకత్వంలో శ్రీనివాసకుమార నాయుడు నిర్మాతగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా బేబీ సినిమా తీశారు.ఈ కథ తన ప్రేమించొద్దు సినిమా కథ ఒక్కటేనని శిరిన్ శ్రీరామ్( Shirin Sriram ) ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.మరి ఈ విషయంపై ఇంకా ఇంకా మరింత సమాచారం తెలియాల్సి ఉంది.అయితే మొన్నటి వరకు శ్రీమంతుడు సినిమాపై ఇదేవిధంగా వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.ఇప్పుడు బేబీ సినిమాపై కూడా అలాంటి వాదనలే వినిపిస్తున్నాయి.







