తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా తన కంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న రాజమౌళి( Director Rajamouli ) ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమాలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో అతను పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇంతకుముందు ఆయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలతో భారీ సక్సెస్ ని అందుకొని ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనని మించిన దర్శకుడు మరొకరు లేరు అనేలా గుర్తింపు అయితే సంపాదించుకున్నాడు.

ఇక ఇప్పుడు మహేష్ బాబు( Mahesh Babu ) తో వరల్డ్ లో ఉన్న చాలా రికార్డ్ లను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే అందరు డైరెక్టర్ల లాగే రాజమౌళి కూడా సెంటిమెంట్లను( Sentiments ) ఫాలో అవుతాడా అంటూ సోషల్ మీడియాలో ఆయన మీద భారీ ఎత్తున ట్రోల్లింగ్స్( Trollings ) అయితే చేస్తున్నారు అయితే చేస్తున్నారు.అయితే ఇప్పటివరకు రాజమౌళి ఎలాంటి సెంటిమెంట్లను నమ్మడు.
తన సినిమాలో క్యారెక్టర్ కి ఎవరు అవసరం అనుకుంటే అతను ఫ్లాప్ ల్లో ఉన్న సరే ఆ హీరోని కూడా తీసుకుంటాడు అని జనాలు నమ్మారు.కానీ ప్రస్తుతం రాజమౌళి కూడా సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు అంటూ జనాలు కామెంట్లు చేస్తున్నారు.

ఇక దానికి కారణం ఏంటి అంటే బాహుబలి త్రిబుల్ ఆర్( RRR ) రెండు సినిమాలు మొదటగా అల్యూమినియం ఫ్యాక్టరీ( Aluminium Factory ) నుంచి షూటింగ్ స్టార్ట్ చేసుకున్నాయి.అవి రెండు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.కాబట్టి ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాని కూడా అల్యూమినియం ఫ్యాక్టరీ నుంచి మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది.దానికి సంబంధించిన సెట్ వర్క్ ను కూడా పూర్తి చేసే పనిలో టీమ్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు అనేది ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశంగా మారింది…
.