టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్( Pawan kalyan ) ఏ విషయం గురించి మాట్లాడినా తన మనస్సులోని అభిప్రాయాన్ని నిక్కచ్చిగా వెల్లడించడానికి ఇష్టపడతారనే సంగతే తెలిసిందే.వివాదాలకు, వివాదాస్పద విషయాలకు సాధారణంగా పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటారు.
కొన్నిరోజుల క్రితం కోలీవుడ్ ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.కోలీవుడ్ మూవీ ఐమా తాజాగా థియేటర్లలో విడుదలైంది.

ప్రముఖ దర్శకుడు రాహుల్ ఆర్.కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.దర్శకుడు పేరరుసు( Director perarusu ) ఈ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఐమా అంటే దైవశక్తి అని అర్థమని కామెంట్లు చేశారు.
కేరళకు చెందిన యాక్టర్లు ఈ సినిమాలో ఎక్కువగా నటించారని ఆయన చెప్పుకొచ్చారు.కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువ సినిమాలను ఇతర రాష్ట్రాల్లో సెట్స్ వేసి షూట్ చేస్తున్నారని ఆయన కామెంట్లు చేశారు.
ఆయా రాష్ట్రాలకు చెందిన కళాకారులు, సాంకేతిక వర్గం ఈ సినిమాల కోసం పని చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.తమిళ సినిమాలకు సంబంధించి అక్కడి సాంకేతిక వర్గానికి, అక్కడి కళాకారులకు పని కల్పిస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.
ఇదే విషయాన్ని ఆర్కే సెల్వమణి కూడా ఒక సందర్భంలో చెప్పారని పేరరుసు చెప్పుకొచ్చారు.ఆ కామెంట్లు సముచితం కాదని పవన్ అన్నారని ఆయన వెల్లడించారు.

సెల్వమణి ( Selvamani )వ్యాఖ్యలు స్వార్థపూరితంగా ఉన్నాయని పవన్ చెప్పారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.మన కళాకారులకు, మన టెక్నీషియన్లకు పని ఇవ్వాలని కోరడంలో తప్పేముందని పెరరుసు అన్నారు.పెరరుసు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.పెరరుసు చేసిన కామెంట్ల విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.పెరరుసు చేసిన కామెంట్ల గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.