గద్దలకొండ కోసం పెరిగితే గని కోసం తగ్గాడట.. డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఏ రంగంలో అయినా ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే కెరీర్ లో ముందుకు వెళుతారు.మరి మన టాలీవుడ్ లో అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనలో వేరియేషన్స్ చూపిస్తున్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.

 Director Kiran Korrapati Talks About Ghani Varun Tej Details, Ghani, Varun Tej,-TeluguStop.com

ఈయన మొదటి నుండి కూడా డేరింగ్ స్టెప్పులు వేస్తూ ఆడియెన్స్ ను తన నటనతో అలరిస్తున్నాడు.ప్రెసెంట్ వరుణ్ తేజ్ గని సినిమా చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.

ఈ సినిమాను అల్లు బాబీ, సిద్ధూ ముద్దా నిర్మించారు.ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ కాబోతుంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు పెరిగేలా చేసింది.ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ అన్ని కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసాయి.రెండు రోజుల క్రితమే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.ఈ సినిమాను చూశానని చాలా బాగుంది అని చెప్పుకొచ్చాడు బన్నీ.

Telugu Allu Arjun, Kiran Korrapati, Ghani, Tholiprema, Varun Tej, Venky Atluri-M

ఇక తాజాగా కిరణ్ కొర్రపాటి కెరీర్ గురించి చెప్పుకొచ్చాడు.తొలిప్రేమ సమయంలో వెంకీ అట్లూరి దగ్గర వర్క్ చేసానని రవితేజ ప్రోత్సాహంతో అక్కడ చేసానని తెలిపాడు.డైరెక్టర్ గా సినిమా చేయాలని తిరిగిన పని అవ్వలేదని.ఆ తర్వాత మిస్టర్ కు కో డైరెక్టర్ గా పని చేసానని అప్పుడే వరుణ్ తేజ్ తో పరిచయం స్టార్ట్ అయ్యిందని.

ఆ పరిచయం గని సినిమా తెరకెక్కడానికి దారి తీసిందని తెలిపారు.

Telugu Allu Arjun, Kiran Korrapati, Ghani, Tholiprema, Varun Tej, Venky Atluri-M

తొలిప్రేమ చివరి రోజు వరుణ్ ఈ సినిమా ప్రకటన చేసారని.అప్పటికి కథ కూడా రెడీ అవ్వకపోయిన కేవలం వరుణ్ తేజ్ నా పైన నమ్మకంతో ఆ ప్రకటన చేసారని అన్నారు.గడ్డలకొండ గణేష్ సినిమాలో పాత్ర కోసం దాదాపు ఆయన 15 కేజీల బరువు పెరిగారని.

గని లోని బాక్సర్ పాత్ర కోసం ఆయన బాగా తగ్గారని.సిక్స్ ప్యాక్ ను దాదాపు మూడేళ్ళ పాటు మెయిన్ టైన్ చేసారని ఆయన ఈ సినిమా కోసం పడిన కష్టం మాటల్లో చెప్పలేనని కిరణ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube