ఆ ప్రముఖ డైరెక్టర్ కు హీరోయిన్ కృతిశెట్టిపై చాలాసార్లు కోపం వచ్చేదట.. ఏం జరిగిందంటే?

ఉప్పెన సినిమా( Uppena Movie )తో కృతిశెట్టి చిన్న వయస్సులోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.తొలి సినిమాతోనే 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను కృతిశెట్టి( Krithi Shetty ) ఖాతాలో వేసుకున్నారు.

 Director Buchi Babu Comments About Uppena Movie Krithi Shetty Details Here Goes-TeluguStop.com

ఉప్పెన మూవీకి బుచ్చిబాబు డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర మంచి తండ్రి అని సినిమాలో విలన్ లేరని పరిస్థితులకు అనుగుణంగా పాత్రల ప్రభావం ఉంటుందని బుచ్చిబాబు పేర్కొన్నారు.

Telugu Climax, Buchi Babu, Krithi Shetty, Uppena-Movie

లవ్ స్టోరీలో కొత్త అమ్మాయి ఉంటే ప్లస్ అవుతుందని నేను భావిస్తానని ఆయన చెప్పుకొచ్చారు.ఆ రీజన్ వల్లే ఈ సినిమాలో కృతిశెట్టిని ఎంచుకున్నానని బుచ్చిబాబు( Director Buchi Babu ) వెల్లడించారు.ఉప్పెన కథ విని దేవిశ్రీ ప్రసాద్ ఎంతగానో మెచ్చుకున్నారని బుచ్చిబాబు పేర్కొన్నారు.ఉప్పెన కథ చెప్పిన వారం రోజుల్లోనే దేవిశ్రీ ప్రసాద్ మూడు ట్యూన్స్ ఇచ్చారని బుచ్చిబాబు కామెంట్లు చేశారు.

మాది ఉప్పాడ అని సముద్రం బ్యాక్ డ్రాప్ లో కథ చెప్పాలని నేను భావించానని ఆయన అన్నారు.కొత్త పాయింట్ ను పాతగా చెప్పాలని మొత్తం కొత్తగా చెప్పడం కూడా రైట్ కాదని నేను భావిస్తానని బుచ్చిబాబు కామెంట్లు చేశారు.

సుకుమార్( Sukumar ) ఏదైనా కథను పది వెర్షన్లు రాస్తారని ఆయన చెప్పుకొచ్చారు.నాకు నా గురువు సుకుమార్ గారు స్పూర్తి అని బుచ్చిబాబు కామెంట్లు చేశారు.

Telugu Climax, Buchi Babu, Krithi Shetty, Uppena-Movie

ఉప్పెన క్లైమాక్స్ విషయంలో చాలా కష్టపడ్డానని ఆయన తెలిపారు.కృతిశెట్టిపై కొన్నిసార్లు కోపం వచ్చేదని ఆయన కామెంట్లు చేశారు.విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) మాత్రం ఆ అమ్మాయి చిన్నపిల్ల అని ఏమీ అనవద్దని చెప్పేవారని బుచ్చిబాబు పేర్కొన్నారు.కృతిశెట్టి కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆయన కామెంట్లు చేశారు.

ఉప్పెన మూవీ కథ విన్న సమయంలో నేషనల్ అవార్డ్ వస్తుందని మెగాస్టార్ చిరంజీవి చెప్పారని బుచ్చిబాబు కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube