సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలి అంటే టాలెంట్ ఉంటే మాత్రమే కాదు కాస్త అదృష్టం కూడా ఉండాలని భావిస్తారు.ఇలా ఎంతో సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఎంతో మంది హీరోలు సినిమాల విషయంలో కాస్త వెనుకబడిన విషయం మనకు తెలిసిందే.
అయితే డైరెక్టర్ల విషయంలో కూడా సక్సెస్ రేట్ ఉన్నప్పుడే వాళ్ళు ఇండస్ట్రీలో ముందుకు సాగగలరు.తమిళ దర్శకుడిగా ఎంతో ఫేమస్ అయినటువంటి భాస్కర్ (Bhasar)తన అద్భుతమైన కథతో నిర్మాత దిల్ రాజు గారిని ఎంతో మెప్పించి ఆయన నిర్మాణంలో సిద్ధార్థ జెనీలియా జంటగా బొమ్మరిల్లు(Bommarillu) అనే చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో వెంటనే ఈయన అప్పటికే మగధీర వంటి బ్లాక్ బస్టర్ అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి హీరో రామ్ చరణ్ (Ramcharan) తో ఆరెంజ్ (Orange)సినిమాని చేశారు.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ భారీ బడ్జెట్ చిత్రంతో నాగబాబు(Nagababu) ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు మొదటి షో నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇక నిర్మాత నాగబాబు కూడా ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఇకపోతే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని తిరిగి విడుదల చేశారు.
ఇలా ఈ సినిమా విడుదలైన సందర్భంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తుంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ సైతం ఈ సినిమాని థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చూశారు.
అయితే థియేటర్లలో ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసినటువంటి ఈయన ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇదే విషయాన్ని ఈయన సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఒకప్పుడు ఈ సినిమా విషయంలో ఎంతో అవమాన పడిన తనకు ఇప్పుడు అదే సినిమా ఎంతో గౌరవాన్ని గుర్తింపును తీసుకువచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ సినిమా తర్వాత చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి బొమ్మరీలు భాస్కర్ అక్కినేని అఖిల్(Akhil) హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నప్పటికీ ఈయనకు తదుపరి సినిమా అవకాశాలు మాత్రం రాలేదు.