అనిల్ రావిపూడి దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 3 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి తన గురించి వస్తున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేస్తూనే తనపై వస్తున్నటువంటి ట్రోల్స్ గురించి మాట్లాడారు.
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ కొందరు ఉద్దేశపూర్వకంగానే టీమ్ గా ఏర్పడి తనపై ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.ఒక విధంగా వాళ్ళు ట్రోల్ చేసిన విధంగా నా సినిమాలో తప్పులు ఉంటే ప్రేక్షకులు నా సినిమాలను ఎందుకు చూస్తారు అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇలా నేను చేసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి ట్రోల్స్ ఎదురవడంతో ఈ ట్రోల్స్ వెనుక కొందరి ప్రమేయం ఉందని ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ విధంగా ఉద్దేశపూర్వకంగా తనపై ట్రోల్ చేసే టీమ్ ఎవరో కూడా తనకు తెలుసని చెప్పిన అనిల్ రావిపూడి వారి గురించి మాత్రం బయట పెట్టలేదు.ఇలా తన గురించి వస్తున్న ట్రోలింగ్ గురించి చెబుతూనే తన తదుపరి సినిమాలకు సంబంధించిన విషయాలను కూడా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.ఇక ఎఫ్3 సినిమా విడుదల కావడంతో అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్టు బాలకృష్ణతో చేయనున్నారు ఈ క్రమంలోనే ఈ సినిమా స్క్రిప్ట్ పనులతో అనిల్ బిజీకానున్నట్లు తెలుస్తోంది.







