రిపబ్లికన్ మద్ధతుదారులకు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) దంపతులు బంపరాఫర్ ఇచ్చారు.పెద్ద మొత్తంలో నిధులు విరాళంగా ఇచ్చిన వారు ట్రంప్- మెలానియాతో( Trump- Melania ) డిన్నర్ చేసే అవకాశం పొందవచ్చని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
దాదాపు 1 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చే వారికి ఈ అవకాశం ఉంటుందని రిపబ్లికన్ వర్గాలు చెబుతున్నాయి.జనవరి 18న వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జేడీ వాన్స్( J.D.Vance ), అతని భార్య ఉషా వాన్స్( Usha Vance ), ట్రంప్ కేబినెట్ నామినీలతో రిసెప్షన్ సహా మొత్తం ఎనిమిది ఈవెంట్‌లు తెరపైకి వచ్చాయి.వీటిలో పాల్గొనాలని అనుకునే దాతలు 1 మిలియన్ లేదా 2 మిలియన్ డాలర్ల విరాళం అందించాల్సి ఉంటుంది.
జనవరి 20వ తేదీన ట్రంప్, వాన్స్‌లు బ్లాక్ టై ‘‘స్టార్ లైట్ బాల్ ’’కి హాజరవుతారు.అత్యధిక మొత్తం ఇచ్చిన ప్రధాన దాతలకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం దొరుకుతుందని రిపబ్లికన్ వర్గాలు చెబుతున్నాయి.ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రతిపాదికన అమెరికా నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉచితంగా టికెట్లను అందించనున్నారు.
అయితే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మెలానియా నిర్ణయాలు ఇంకా ధృవీకరించబడలేదు.ఆదివారం జరిగే మతపరమైన సేవ ‘‘ వన్ అమెరికా, వన్ లైట్ సండే సర్వీస్’ సహా అనేక ఈవెంట్‌లకు తాను హాజరవుతానని ఆమె ఇప్పటికే తెలిపారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం రోజున నిధుల సమీకరణకు విరాళంగా ఇచ్చే మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు.అయితే 200 డాలర్ల కంటే ఎక్కువ మొత్తం లభిస్తే మాత్రం ఫెడరల్ ఎలక్షన్ కమీషన్‌కు నివేదించనున్నారు.అయితే ఈ విరాళాలపైనా గతంలో ట్రంప్‌పై పలు ఆరోపణలు వచ్చాయి.2020లో ట్రంప్ ఆర్గనైజేషన్ , ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ దాదాపు 1.1 మిలియన్ డాలర్ల స్వచ్ఛంద విరాళాలను దారి మళ్లించాయని ప్రాసిక్యూటర్లు ఆరోపించడం దుమారం రేపింది.అంతేకాదు.
తన వ్యాపారం పేరిట 9 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చిన ఒక దాతని విచారించి 12 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.