దినేష్ కార్తీక్ సంచలన బ్యాటింగ్ తో నా స్థానానికి ప్రమాదమన్న స్టార్ క్రికెటర్..

తాజాగా ప్రపంచంలోని క్రికెట్ జట్టులన్నీ టి20 వరల్డ్ కప్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాయి.వాటిలో భాగంగానే కొన్ని టీంలలో ఆటగాళ్ల మధ్య జట్టులో స్థానం సంపాదించడం కోసం పోటీ ఏర్పడింది.

 Dinesh Karthik Is A Dangerous Star Cricketer For My Position With Sensational Ba-TeluguStop.com

టీమిండియా క్రికెట్ జట్టులో కూడా ప్రపంచంలో ఏ క్రికెట్ టీంకు ఏర్పడనంత పోటీ ఏర్పడింది.టీమిండియా క్రికెట్ జట్టులో పేరు తెచ్చుకున్న దినేష్ కార్తీక్ పై ఈ సంవత్సరం టి20 లలో పరుగుల వరద పారిస్తున్న స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర కామెంట్లు చేశాడు.

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌లో దినేశ్ బ్యాటింగ్ తీరు చూస్తే నా నాలుగో స్థానానికి గురి పెట్టేలా ఉన్నాడని చెప్పాడు.వెంటనే తాను ఇలాంటివేవీ పట్టించుకోనని, ఏదో సరదాగా అలా అన్నానని చెప్పాడు.

స్థానం ఏదైనా ఆడినంత సేపు ఆటను ఎంజాయ్ చేయడమే నాకిష్టమని సూర్యకుమార్ వెల్లడించాడు.దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.

మొదటి రెండు మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించగా, మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్‌ ఈ మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు.

Telugu Inesh Karthik, Spots, Cup, India-Sports News క్రీడలు

ఈ టి 20 సిరీస్ లోని ఒక మ్యాచ్‌లో టీమిండియా నాలుగో పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటంతో నాలుగో స్థానంలో సూర్యకుమార్‌కు బదులు గా బెస్ట్ ఫినిషర్‌ దినేశ్ కార్తీక్‌ను పంపినప్పుడు, అతను జట్టు నమ్మకాన్ని వమ్ము చేయకుండా 21 బంతుల్లో 46 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఈ ఇన్నింగ్స్ పై సూర్య ఫన్నీ కామెంట్స్ చేశాడు.మరికొన్ని రోజులలో ఆస్ట్రేలియాలో మొదలయ్యే టి20 ప్రపంచకప్ లో సూర్య కుమార్ యాదవ్ దినేష్ కార్తీక్ పరుగుల వరద పారించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube