దిల్ రాజు( dil raju ) తో కలిసి ఆయన సోదరుడు శిరీష్( Shirish ) సినిమాల నిర్మాణం చూసుకుంటూ ఉంటాడు.దిల్ రాజు మాదిరిగా శిరీష్ లైమ్ లైట్ లోకి రాలేదు.
అయితే శిరీష్ తనయుడు ఆశిష్( Ashish ) హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.రౌడీ బాయ్స్ సినిమా తో ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన దిల్ రాజు ఫ్యామిలీ వారసుడు ఆశిష్ ఆ తర్వాత సినిమా ఇప్పటి వరకు రాలేదు.
ఆ మధ్య సెల్ఫిష్ అనే సినిమా ను మొదలు పెట్టిన విషయం తెల్సిందే.

ఇప్పటికే షూటింగ్ పూర్తి అయింది.సంక్రాంతి బరిలో సినిమా నిలుస్తుందేమో అని అంతా భావించారు.కానీ అనూహ్యంగా సినిమా ను మధ్య లో ఆపేశారు అంటున్నారు.
షూటింగ్ పూర్తి అవ్వడానికి వచ్చిన ఈ సినిమా ను మళ్లీ మొదటికి తీసుకు వచ్చి షూటింగ్ చేయాలని భావిస్తున్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం స్టోరీ లైన్ అదే ఉంచి, స్క్రిప్ట్ మరియు స్క్రీన్ ప్లే మార్చుతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు షూటింగ్ జరిపింది అంతా కూడా డంప్ చేయడమే అంటున్నారు.నిర్మాతకు భారీ గా నష్టం వచ్చినా పర్వాలేదు కానీ మంచి ఔట్ పుట్ ఇవ్వాలని భావిస్తారు.
ఇప్పుడు దిల్ రాజు కాంపౌండ్ లో జరుగుతోంది.

దిల్ రాజు సొంత సినిమా అవ్వడం తో పాటు తమ ఫ్యామిలీ వారసుడి సినిమా అవ్వడం వల్ల ఎలాంటి అనుమానం లేకుండా మొత్తం షూటింగ్ రషెష్ ను డంప్ చేయాలని నిర్ణయానికి వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు.అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి దిల్ రాజు ఇతర హీరోల సినిమా ల పట్లే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు.
అలాంటిది ఈ సినిమా విషయం లో ఆయన లైట్ గా ఉంటాడా చెప్పండి.అందుకే కొడుకు సినిమా వల్ల కోట్లు నష్టం వచ్చినా కూడా పర్వాలేదు అన్నట్లుగా ముందడుగు వేసేందుకు రెడీ అవుతున్నాడు.