చిరు కోసం ఆరు కథలతో దిల్ రాజు..!

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.ఈమధ్యనే ఓ ఈవెంట్ లో స్టేజ్ మీద కూడా బాస్ మా బ్యానర్ లో ఓ సినిమా చేయాలని సభాముఖంగానే అడిగారు దిల్ రాజు.

 Dil Raju Six Stories For Megastar Chiranjeevi ,  Bhola Shankar , Chiranjeevi ,-TeluguStop.com

అయితే చిరుని ఒప్పించడం అంటే అది అంత సామాన్యమైన విషయమేమి కాదు.రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలు చేస్తున్నా సరే అందులో కొణిదెల ప్రొడక్షన్స్ సగ భాగం భాగస్వామ్యం అవుతుంది.

చిరు రెమ్యునరేషన్ రూపంలో కాకుండా సినిమా ప్రొడ్యూసింగ్ లో భాగమై బిజినెస్ లో షేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

అయితే దిల్ రాజు తో కూడా అలా చేస్తారా లేదా అన్నది చూడాలి.

మాములుగా అయితే దిల్ రాజు సినిమా అంటే తాను ఒక్కడే ప్రొడ్యూస్ చేస్తాడు.చిరుతో తను చేసే సినిమా కొణిదెల బ్యానర్ ఇన్వాల్వ్ మెంట్ లేకుండానే చేయాలని చూస్తున్నాడు.

అయితే ఎలాగైనా సరే చిరుతో సినిమా చేయాలని ఫిక్స్ అయిన దిల్ రాజు ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కథలతో చిరు దగ్గరకు వెళ్లారట.తన దగ్గరకు వచ్చిన ఆరు కథలు అవి కూడా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కి సరిపడే కథలని దిల్ రాజు చిరు దగ్గరకు తీసుకెళ్లారట.

Telugu Bhola Shankar, Chiranjeevi, Dil Raju, Godfather, Tollywood-Movie

వాటిలో ఏ కథ నచ్చితే దానితో దిల్ రాజు ప్రొడక్షన్ లో మెగా మూవీ ప్లాన్ చేస్తున్నారట.చిరు కోసం తన దగ్గర ఉన్న ఆరు కథలతో దిల్ రాజు చాలా పెద్ద సాహసమే చేస్తున్నాడని చెప్పొచ్చు.అయితే ఈ ఆరు కథలు ఎవరు ఇచ్చారు.వాటికి దర్శకులు ఎవరు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.ప్రస్తుతం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో త్వరలో రాబోతున్నారు.ఆ తర్వాత భోళా శంకర్, వాళ్తేర్ వీరయ్య లైన్ లో ఉన్నాయి.

ఇవి కాకుండా వెంకీ కుడుములతో ఒక సినిమా ఉంది.ఈ సినిమాల తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube