తెలుగు స్టార్ నిర్మాతలు ఈమద్య కాస్త జోరు తగ్గించారు.భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఎక్కువ శాతం నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు.
కాని దిల్‌రాజు మాత్రం చిన్నా, పెద్దా చిత్రాలను బ్యాలన్స్ చేస్తూ వరుసగా చిత్రాలను నిర్మించుకుంటూ వస్తున్నాడు.సంవత్సరంలో కనీసం నాలుగు అయిదు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిర్మాత దిల్‌రాజు ఇటీవలే రాజ్ తరుణ్ ‘లవర్’ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది.
ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

దిల్‌రాజు ఈమద్య కాస్త అతిగా మాట్లాడుతున్నాడు అనే విమర్శలను మూట కట్టుకుంటున్నాడు.ఈయన ‘లవర్’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రాజ్ తరుణ్‌ను చాలా అవమానించినట్లుగా మాట్లాడటం జరిగింది.రాజ్ తరుణ్ ఆ మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డట్లుగా అనిపించింది.
ఇక తాజాగా నితిన్ విషయంలో కూడా దిల్‌రాజు నోరు జారీ మాట్లాడటం జరిగింది.శ్రీనివాస కళ్యాణం ఆడియో వేడుకలో భాగంగా దిల్‌రాజు మాట్లాడుతూ నితిన్ నన్ను చాలా సార్లు కలిసి ఒక సినిమా చేయమని రిక్వెస్ట్ చేశాడు.
కాని నాకు వీలు కాకపోవడం వల్ల సినిమాను ఇన్నాళ్లు ఆయనతో చేయలేక పోయాను, ఇప్పటికి సాధ్యం అయ్యింది అంటూ నితిన్ గాలితీసేలా మాట్లాడాడు.
ఇక తాజాగా ‘శ్రీనివాస కళ్యాణం’ విడుదల దగ్గర పడుతున్న సమయంలో దిల్‌రాజు మీడియాతో మాట్లాడుతూ మరోసారి నోరు జారినట్లుగా మాట్లాడాడు.
ఈ చిత్రంలో నితిన్ వివాహంను చూసిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మరియు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు నితిన్ వివాహం చేసుకుంటాడా అని ఎదురు చూస్తారు.ఒక వేళ నితిన్ పెళ్లి ఆలస్యం చేస్తే వెళ్లి కొట్టినా కొట్టేస్తారేమో అంటూ దిల్‌రాజు వ్యాఖ్యానించాడు.
మొత్తానికి ఈమద్య దిల్‌రాజు నోరు అదుపులో పెట్టుకోకుండా పదే పదే మాట్లాడుతున్న కారణంగా కొందరు ఈయనపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.నితిన్ ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాలి అంటూ దిల్‌రాజు మాటల్లో అర్థం కనిపిస్తుంది.

ఈతరం కుర్రాళ్లు చాలా ఆలస్యంగానే వివాహం చేసుకుంటున్నట విషయం తెల్సిందే.అదే విధంగా నితిన్ కూడా ఆలస్యం చేస్తున్నాడు.ఇండస్ట్రీలో నితిన్ కంటే సీనియర్‌లు, ఏజ్ ఎక్కువ ఉన్న వారు కూడా ఉన్నారు.కాని దిల్‌రాజు మాత్రం నితిన్‌ను ఎత్తి చూపడం ఏంటని కొందరు విమర్శిస్తున్నారు.దిల్‌రాజు ఇకపై అయినా కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.