ఇంకొన్నాళ్లు 'బలగం' ను థియేటర్‌ లో ఉంచాల్సింది.. ఓటీటీ స్ట్రీమింగ్‌ వద్దు

ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బలగం సినిమా గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది.

దిల్ రాజు నిర్మాణం లో వచ్చిన ఈ సినిమా కు వేణు దర్శకుడు.

కమెడియన్ గా పలు సినిమాల్లో నటించి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు సొంతం చేసుకుని ఆ తర్వాత ఎన్నో బుల్లి తెర కార్యక్రమాల్లో కనిపించిన వేణు బలగం( Balagam ) చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఒక విభిన్నమైన కుటుంబ కథ చిత్రం పల్లెటూరులో అది కూడా తెలంగాణ పల్లెలో సాగే ఈ కథ ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకుంటుంది.

అద్భుతమైన కథ నేపథ్యం కాకున్నా కూడా సింపుల్ స్టోరీ లైన్ తో బంధాలను దర్శకుడు చూపించిన తీరు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.

థియేటర్ లో ఇప్పటికే సినిమా ను ఎంతో మంది చూశారు.ఇక ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.అయితే థియేటర్ ల్లో ఇంకా కొన్ని రోజులు ఈ సినిమాను ఉంచితే మంచి కలెక్షన్స్ వస్తాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

థియేటర్లకు ఇప్పటికి కూడా ఊర్ల నుండి పెద్ద ఎత్తున ఆటోలు మరియు ట్రాక్టర్లు వేసుకొని వచ్చి బలగం సినిమాను చూసి వెళ్తున్నారు.కనుక థియేటర్లలో సినిమా ను ఉంచడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇప్పటికే దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ వీడియో కి ఈ సినిమా ను అమ్మేశాడు.

కనుక వారు థియేటర్ రిలీజ్ మరియు థియేటర్ రన్ విషయాలను పట్టించుకోకుండా స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయ్యే అవకాశాలున్నాయి.ఒకవేళ అమెజాన్ లో ( Amazon )స్క్రీనింగ్ అయినా కూడా థియేటర్లలో సినిమా ను ప్రదర్శించాలని కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు.దిల్‌ రాజు( Dil raju ) నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 1, శనివారం, 2021
Advertisement

తాజా వార్తలు