అలుపెరుగని పోరాటం చేస్తున్న పాప్ గాయని స్మిత

స్మిత తెలుగు లో మొట్టమొదటి పాప్ గాయనిగా పేరు సంపాదించుకుంది.పాత పాటలను రీమిక్స్ చేసి వాటికి కొత్త రూపం ఇచ్చి ప్రసిద్ధ గాయనిగా పేరు సంపాదించుకుంది.

 Different Shades In Smitha Career , Smitha,  Smitha Career , Padutha Theeyaga ,-TeluguStop.com

ఆమె విజయవాడలో జన్మించింది.నాలుగేళ్ల వయసులోనే పాటలు పాడటం మొదలుపెట్టింది.

ఇక పాడుతా తీయగా ప్రోగ్రాంలో పాల్గొని తొలిసారిగా ఆమె గొంతును ప్రజలకు పరిచయం చేసింది.ఈ ప్రోగ్రాం లో ఆమె విన్నర్ గా నిలవకపోయినా కూడా మంచి పేరు అయితే సంపాదించుకుంది.

ఆ తర్వాత ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.దాంతో పాటే ఆమె పాప్ సంగీతానికి చక్కగా సరిపోతుంది అనే ఉద్దేశంతో హాయ్ రబ్బ అని ఒక మ్యూజిక్ ఆల్బమ్ నీ రూపొందించింది.

అప్పట్లో ఇది ఒక పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్.ఆ తర్వాత అనేక ఆల్బమ్స్ ఆమె ద్వారా బయటకు వచ్చాయి.

Telugu Bollywood, Malliswari, Nijam Smitha, Pop, Shamantakamani, Smitha, Smitha

గాయనిగా తెలుగుతో పాటు కోలీవుడ్, కన్నడ, బాలీవుడ్ పరిశ్రమలలో పనిచేసింది.కేవలం గాయని గా కొనసాగితే ఆమె గురించి మనం ఇంత సేపు మాట్లాడుకునే వాళ్ళం కాదు.ఆమె పాటలు మాత్రమే కాకుండా నటిగా కూడా మారాలని నిర్ణయించుకుంది.అందుకే 2004 లో మల్లీశ్వరి సినిమాలో తొలిసారిగా కనిపించింది.ఆ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని 2007 లో ఆట సినిమాలో కూడా కనిపించింది.డైయింగ్ టు బి మీ అనే ఒక షార్ట్ ఫిలిం లో కనిపించిన స్మిత చివరిసారిగా 2015 లో శమంతకమణి అనే సినిమాలో కనిపించింది.

అక్కడితో స్మిత ఆగిపోలేదు.పాటలు పాడుతూనే ఓవైపు నటిస్తూ మరోవైపు తనదంటూ ఒక సొంత బిజినెస్ ఉండాలనే నిర్ణయించుకుని 2002లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ పేరుతో హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో బ్యూటీ సెలూన్ ని ఓపెన్ చేసింది.

అక్కడ మొదలయింది ఆమె ప్రస్థానం.ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో అదే పేరుతో వెంచర్ లు కూడా విస్తరించింది.

Telugu Bollywood, Malliswari, Nijam Smitha, Pop, Shamantakamani, Smitha, Smitha

ఇక అన్నిటికన్నా ఆరోగ్యం మిన్న అనే ఉద్దేశంతో పెట్టిన సెంటర్ ను కూడా ఓపెన్ చేసింది.ఐ కాన్ ది ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ సంస్థ కూడా నడిపిస్తోంది.ఈ సంస్థ ద్వారా టీవీకి సంబంధించిన కార్యక్రమాలను చేస్తుంది స్మిత.ఇక ఇటీవల యాంకరింగ్ లో కూడా తన భవిష్యత్తు తెలుసుకోబోతోంది.నిజం విత్ స్మిత అనే ఒక ప్రోగ్రామ్ ని ఓటీటి లో విడుదల చేసింది.దీంట్లో తాను హోస్ట్ గా కూడా పని చేయగలను అని నిరూపించుకుంది.

ఇలా నటిగా, వ్యాపారవేత్తగా, సినీ గాయనిగా, పాప్ సింగర్ గా, హోస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటుంది స్మిత.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube