మనదేశంలోని ముంబై మహానగరంలో నెలకొన్న భారతీయ సినిమా పరిశ్రమను బాలీవుడ్ అని పిలుస్తారు.యునైటెడ్ స్టేట్స్‌లోని లాస్-ఏంజిల్స్ మెట్రోపాలిస్ పరిసరాల్లో నెలకొన్న ప్రపంచ సినిమా రాజధానిని హాలీవుడ్ అని కూడా పిలుస్తారు.
హైటెక్, ఎకానమీ కారణంగా హాలీవుడ్ అత్యుత్తమ యానిమేషన్, సైన్స్ ఫిక్షన్, ఎపిక్, వార్ సినిమాలను నిర్మిస్తుంది, బాలీవుడ్‌లో డ్రామా, రొమాన్స్, యాక్షన్ మొదలైన వాటిపై ఆధారపడిన సినిమాలు వస్తుంటాయి.బాలీవుడ్- హాలీవుడ్‌లను ఒకదానికొకటి వేరుచేసే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు హాలీవుడ్- బాలీవుడ్ చిత్రాలను చూసి ఉంటే ఖచ్చితంగా ఈ తేడాలను గమనించేవుంటారు 1 సినిమా చిత్రీకరణ మొదలు సినిమా ప్రమోషన్ వరకు హాలీవుడ్‌లో రూపొందే సినిమాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంటారు.హాలీవుడ్‌లో సాధారణంగా లేత రంగులను ఉపయోగిస్తారు.అదే సమయంలో చాలా బాలీవుడ్ చిత్రాలలో కాస్ట్యూమ్ నుండి సెట్స్ వరకు ప్రతిదీ చాలా కలర్‌ఫుల్‌గా అందంగా ఉండేలా చూసుకుంటారు.2.హాలీవుడ్‌లో సాధారణ కుటుంబ చిత్రాలు, సాంప్రదాయ విషయాలు కనిపించవు.ప్రతిదీ ఆధునిక పద్ధతిలో చూపిస్తారు.
అందుకు భిన్నంగా బాలీవుడ్‌లో పెళ్లి మొదలు కొని.దీపావళి నుంచి హోలీ వరకు అన్నీ సంప్రదాయంగా చూపించారు.

3.బాలీవుడ్ సినిమాల్లో ఎమోషనల్ సన్నివేశాల్లో నటీనటులు తమ భావాలను బహిరంగంగా చూపిస్తారు.హాలీవుడ్‌లో నటీనటులు తమ ముఖాల్లో ఎక్కువ భావోద్వేగాలను తీసుకురారు.4.హాలీవుడ్‌లో పాటలు బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతాయి.కానీ బాలీవుడ్‌లో అవి కథలో భాగంగా ఉంటాయి.వాటికి ప్రేక్షకులు స్పందిస్తూ డ్యాన్స్ చేసి థియేటర్‌లో ఆనందిస్తారు.5.హాలీవుడ్ కామెడీ చిత్రాలలో ప్రధాన పాత్రకు జీవితంలో జరిగే ఫన్నీ సంఘటనలు ప్రేక్షకులను నవ్విస్తాయి.మరోవైపు బాలీవుడ్ చిత్రాలలో కామెడీ పుష్కలంగా ఉంటుంది.
బాలీవుడ్ చిత్రాలలో నటీనటుల మధ్య జోకులు, పరస్పర సంభాషణల ద్వారా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేస్తారు.