చంద్రబాబు ఓటు బ్యాంకు చెదురుతోందా..!

ఇప్ప‌టివ‌ర‌కూ త‌న స‌మ‌ర్థ పాల‌న‌తో, అభివృద్ధి మంత్రంతో అన్ని వర్గాల‌కూ చేరువయిన సీఎం చంద్ర‌బాబు… ఇప్పుడు ఆ వ‌ర్గాల‌న్నింటినీ దూరం చేసుకుంటున్నారా? క‌్ర‌మ‌క‌్ర‌మంగా పెంచుకున్న ఓటు బ్యాంకుకు దూర‌మైపోతున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.ప్ర‌స్తుతం ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు కొన్ని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

 Differences Between Chandrababu And Kapu Voters-TeluguStop.com

ప్ర‌స్తుతం హోదా ఉద్య‌మం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.ఏపీకి హోదా ఇవ్వాల‌నే డిమాండ్ యువ‌త‌లో అధిక‌మ‌వుతోంది.

దీనికి మ‌ద్ద‌తుగా విశాఖ బీచ్‌లో చేప‌ట్టిన ఉద్య‌మాన్ని ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా అణిచివేసింది.నిర‌స‌న చేస్తున్న వారిని ఎక్క‌డిక‌క్క‌డ అదుపులోకి తీసుకుంది.

దీంతో యువ‌త‌లో ప్ర‌భుత్వంపై సాధార‌ణంగానే వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో హోదా ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం బీజేపీపై ఒత్తిడి తీసుకురాలేదు.

మ‌రోప‌క్క హోదా కోసం ఉద్య‌మిస్తున్న త‌మ‌ను అరెస్టు చేయించ‌డంపై సాధార‌ణంగానే కొంత వ్య‌తిరేక‌త రావొచ్చు!!

వీటితో పాటు మ‌రోప‌క్క ఏపీలో కాపు ఉద్య‌మం కూడా జోరందుకుంది.మ‌రోసారి దీక్ష‌కు దిగ‌బోతున్న‌ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభాన్ని గృహ నిర్బంధంలో ఉంచి ఆ ఉద్య‌మాన్ని కూడా అణిచివేసింది, దీంతో కాపుల్లోనూ చంద్ర‌బాబుపై కొంత వ్య‌తిరేక వ‌చ్చేలా ఉంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం.

త్వ‌ర‌లో జ‌ర‌గబోయే ఎన్నిక‌ల్లో కాపులు కీల‌కంగా మార‌తార‌నే విష‌యం తెలిసిందే! అలాగే రాష్ట్రంలోని ఓటర్లలో కీలకమైన ఉద్యోగ వర్గం ఇప్పుడు బాబుపై చాలా అసంతృప్తిగా ఉన్నార‌ట‌.డీఏ, మెడిక‌ల్ స్కీమ్, ఏరియ‌ల్స్ వంటి స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగానే ఉంట‌డం కార‌ణ‌మ‌ట‌.

మ‌రోప‌క్క రుణ‌మాఫీ, అంగ‌న్‌వాడీ మ‌హిళ‌ల‌కు జీతాలు ఇవ్వ‌డం పోవ‌డం వంటివి కూడా కీల‌కంగా మార‌బోతున్నాయి, మ‌రి వీట‌న్నింటినీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏవిధంగా అధిగమిస్తుంద‌నేది ఇప్పుడు కీల‌కంగా మారింది, రెండేళ్ల‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలంటే ఈ వ‌ర్గాలు అత్యంత కీల‌కమ‌న్న విష‌యం బాబుకు తెలుసు!! ట్ర‌బుల్ షూట‌ర్‌గా అభివ‌ర్ణించుకునే బాబు.కాపు ఉద్య‌మం, హోదా ఉద్య‌మాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కొని యువ‌త‌, కాపు వ‌ర్గంలోని అసంతృప్తిని ఎలా చ‌ల్లారుస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube