ఆ ఊళ్లో డీజిల్ పాండ్.. ఎంత తోడినా వస్తూనే ఉందట.. మీకూ ఒక బక్కెట్ కావాలా!

పెట్రోల్, డీజిల్… ఈ పేరు వింటేనే చాలా మంది గజగజా వణికిపోతున్నారు.అందుకు కారణం ఇంధన ధరలే.

 Diesel Pond In Geedam Village At Chattisgarh , Diesel Pond , Geedam Village, Ch-TeluguStop.com

అయితే ఓ గ్రామంలో మాత్రం సడెన్ గా డీజిల్ చెరువు ఏర్పడింది.ఆ గ్రామ ప్రజల పంట పండింది.

గ్రామ పరిసరాల్లో డీజిల్ తో కూడిన గుంత ఏర్పడింది.దీంతో ఆ గ్రామస్థులంతా అక్డకు వచ్చి ఫ్రీగా లీటర్లు లీటర్ల డీజిల్ ను తోడుకుంటున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎవరో ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేయగా… నెట్టింట వైరల్ గా మారింది.ఇద డీజిల్ చెరువు మా ఊళ్లో ఏర్పడితే బాగుండని చాలా మంది నెటిజెన్లు భావిస్తున్నారు.

అయితే ఆ ఊరేంటి, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఛత్తీస్ గడ్ లోని దంతెవాడ జిల్లాలో ఉన్న గీడం పోలీస్ స్టేషన్ పరిధి గ్రామ ప్రజలు… గుంతలోంచి లీటర్ల కొద్దీ డీజిల్ ను ఫ్రీగా తోడేస్కుంటున్నారు.

అయితే ఈ డీజిల్ పాండ్ వెనకాల ఓ పెద్ద కథే ఉందియ అదేంటంటే.రాయ్ పూర్ నుంచి బచేలి వెళ్లున్న ఓ డీజిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి బోల్తా కొట్టింది.

ఈ క్రమంలోనే ట్యాంక్ లోని డీజిల్ అంతా నేలపాలైంది.అదికాస్తా దగ్గర్లోని నీటి గుంతలోకి చేరి.అక్కడ డీజిల్ తో కూడిన గుంత తయారైంది.దీన్ని గమనించిన గ్రామస్థులు డీజిల్ మొత్తాన్ని పట్టుకెళ్లిపోయారు.

ఆ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలు మాత్రం నెట్టింట వైరల్ గామారాయి.అయితే ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ తో పాటు క్లీనర్, బైకర్ స్వల్పంగా గాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube