Lavanya Tripathi : పెళ్లిలో లావణ్య కట్టుకున్న చీరలో అది గమనించారా.. ఎప్పటికీ గుర్తుండిపోయే మెమోరీ..!!

మెగా ఫ్యామిలీలోకి కోడలు గా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి ( Lavanya Tripathi ) పెళ్లి చీరలో ఒక స్పెషల్ దాగి ఉంది దాన్ని మీరు ఎవరైనా గమనించారా అంటూ తాజాగా లావణ్య త్రిపాఠి పెళ్లి చీరలో ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరి ఇంతకీ లావణ్య త్రిపాఠి కట్టుకున్న ఆ చీరలో ఉన్న స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వరుణ్ తేజ్ ( Varun tej ) లావణ్య తమ ఇన్నేళ్ల ప్రేమకి స్వస్తి చెప్పి భార్యాభర్తలుగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.ఈ జంట నవంబర్ 1న ఇటలీలోని టెస్కాన్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి పీటలు ఎక్కారు.

ఇక పెళ్లిలో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

లావణ్య త్రిపాటి ( Lavanya Tripathi ) ఎరుపు రంగు కాంచీపురం పట్టు చీరలో దేవకన్యలా మెరిసిపోయింది.ఇక ఈమెను పెళ్లి చీరలో చూడడానికి రెండు కళ్ళు చాలలేదు.అయితే అలాంటి లావణ్య త్రిపాఠి కట్టుకున్న ఆ ఎరుపు రంగు చీరలో ఒక స్పెషాలిటీ దాగి ఉంది.

Advertisement

అయితే చాలామంది ఈ విషయాన్ని గమనించలేదు కావచ్చు.ఇక అదేంటంటే.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే లావణ్య త్రిపాఠి తన పెళ్లి చీరపై ఎప్పటికీ గుర్తిండి పోయే మెమరీ ఉండాలి అని తన చీర పై వారిద్దరి ముద్దు పేర్లు అయినా వరుణ్ లవ్ ( Varun ,Luv) అని రాయించుకొని ఇన్ఫినిటీ అనే గుర్తు కూడా ఆ చీర పై డిజైన్ చేయించుకుంది.ఇక దాని అర్థం వరుణ్ తేజ్ లావణ్యల ప్రేమ ఎప్పటికీ అనంతం గా ఉండాలి అని ఆ డిజైన్ వేయించుకున్నట్టు తెలుస్తోంది.ఇక వీరిద్దరి ప్రేమ ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితాంతం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో లావణ్య త్రిపాఠి తన పెళ్లి చీర పై అలా రాయించుకోవడం చూసి చాలామంది నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం లావణ్య త్రిపాటి తన చీరపై వరుణ్ లవ్ అని రాయించుకున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈరోజు అనగా నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వీరి రిసెప్షన్ పార్టీ గ్రాండ్ గా జరగనుంది.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు