పదో తరగతిలోనే తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చిందని మీకు తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్క్ బ్యూటీగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి అవుతోంది ఇలా ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఇంకా పలు భాషలలో వరుస సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి తమన్నా చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Did You Know That Tamannaah Entered The Industry In Class 10, Tamannaah ,milk Be-TeluguStop.com

ఈ విధంగా ఇండస్ట్రీలో నటిగా మాత్రమే కాకుండా, పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులను మెప్పించారు.ఇక ఈమె తెలుగులో శ్రీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ సాధించుకోలేకపోయింది.2007వ సంవత్సరంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగులో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమన్నా అప్పటినుంచి వెనతిరిగి చూసుకోలేదు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అయినటువంటి తమన్నా చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారట.

తమన్నా 1989 డిసెంబర్ 21వ తేదీ ముంబైలోని సింది కుటుంబంలో జన్మించారు.తమన్నా తండ్రి సంతోష్ భాటియా వజ్రాల వ్యాపారి.ఇలా ముంబైలో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈమె తన 15 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈమె మొదటిసారిగా చాంద్ సా రోషన్ చేహారా సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు.

అయితే ఈ సినిమా సక్సెస్ కాలేదు.ఇదే ఏడాదిలోనే తెలుగులో శ్రీ అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.అయితే హ్యాపీ డేస్ సినిమా తర్వాత వెను తిరిగి చూసుకోకుండా వరుస తెలుగు తమిళ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.

తాజాగా ఈమె గుర్తుందా శీతాకాలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube