విజయవాడ రాజకీయాల్లో అనూహ్యంగా మెరిసిన నాయకుడు కేశినేని నాని.రెండు సార్లు వరుసగా ఎంపీ అయిన ఆయనకు టీడీపీలో మంచి ఫాలోయింగ్ ఉండేది.2014లో విజయవాడ ఎంపీగా గెలుపు గుర్రం ఎక్కిన ఆయనకు పార్టీలో అందరూ సహకరించారు.ఎక్కడ ఎలాంటి పిలుపు ఇచ్చినా ఎలా వ్యవహరించి నా సహకరించారు.
ఎక్కడికి రమ్మన్నా వచ్చారు.ఈ క్రమంలో ఆర్టీఏ అధికారులపై దూకుడు ప్రదర్శించి నా అందరూ కలసి వచ్చారు.
పార్టీ అధికారంలో ఉన్నంత వరకు కేశినేని హవా బాగానే సాగింది.
ఇక, గత ఎన్నికల్లో వైసీపీ సునామీని తట్టుకుని గెలిచిన వారిలో కేశినేని ముందున్నారు.
ఆయన గెలిచా రు.కానీ, పార్టీ ఓడిపోయింది.ప్రబుత్వం మారిపోయింది.అయితే అప్పటికే తన ట్రావెల్స్ వ్యాపారాన్ని ఏపీలో ఎత్తేసి పొరుగు రాష్ట్రంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో ఆయనకు పెద్దగా పని లేకుండా పోయింది.
మరోవైపు పార్టీలోనూ తనను గుర్తించడం లేదని ఆవేదనతో ఉన్నారు.అయితే ఈ ఆవేదనను వ్యక్తీకరించే విషయంలో కేశినేని దూకుడుగా ముందుకు వెళ్లారు.

ఏకంగా అధినేత చంద్రబాబునే ఆయన టార్గెట్ చేశారు.దీంతో పార్టీలోనే కాకుండా పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాతోనూ ఆయన దూకుడుగానే వ్యవహరించారు.ఫలితంగా ఇప్పుడు పార్టీలో కేశినేని ఒంటరయ్యారనే వాదన బాహాటంగానే వినిపిస్తోంది.నిజానికి విజయవాడ రాజకీయాల్లో ఎవరు ఎలా ఉన్నప్పటికీ కమ్మసామాజికవ ర్గానికి చెందిన నాయకులు మాత్రం కలిసి కట్టుగా ముందుకు వెళ్లిన పరిస్థితి ఉంది.
గతంలో పర్వతనేని ఉపేంద్ర ఎంపీగా ఉన్నా లగడపాటి రాజగోపాల్ ఎంపీగా ఉన్నా అందరితోనూ పార్టీలకు అతీతంగా కలివిడిగా ఉండేవారు.
ఇక, సొంత పార్టీలో అయితే ఎంపీ కేంద్రంగానే విజయవాడ రాజకీయాలు నడిచాయి.
కాని ఈ సంస్కృతిని కేశినేనినాని మార్చేశారు.ఇప్పుడు విజయవాడలో టీడీపీ చేస్తున్నకార్యక్రమాలకు ఆయన రావడం లేదు.
పోనీ ఆయన ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? అంటే అది కూడా లేదు.ఎవరితోనూ కలవడం లేదు.
ఎవరూ కూడా ఆయనతో కలవడం లేదు.అందరూ కేశినేనిని దూరంగా ఉంటున్నారు.
దీంతో కేశినేని నాని టీడీపీకి దూరమయ్యారనే భావన స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.మరి మున్ముందు కూడా ఇదే కొనసాగితే నానికే నష్టమని అంటున్నారు పరిశీలకులు.