ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా నిరసన గళం మొదలైందా?

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్ లో పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న పరిస్థితి ఉంది.

కాని అప్పటి నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కూడా ఈ హామీని నెరవేర్చడంలో విఫలం కావడంతో పసుపు రైతుల ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించుకుంది.కవితకు వ్యతిరేకంగా రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎంపీగా కవిత ఓడిపోయిన పరిస్థితి.

ఇక ప్రస్తుత బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు రైతులతో సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సమావేశంలో అరవింద్ పై పసుపు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.

పసుపు మద్దతు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, గెలిచిన మూడు నెలల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేస్తానని అన్నారని, తాను ఇచ్చిన హామీని రైతులు నిలదీయడం జరిగింది.ఏది ఏమైనా అరవింద్ పదవీకాలం పూర్తి కాకముందు పసుపు బోర్డు, పసుపు రైతుల ఇతర డిమాండ్లను నెరేవేర్చకపోతే అరవింద్ కు పెద్ద ఎత్తున నిరసన గళం వినిపించే అవకాశం ఉంది.

Advertisement

ఏది ఏమైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రైతుల ఆగ్రహానికి బలికాక తప్పదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు