గర్భిణీలు పూజలు, వ్రతాలు చేయవచ్చా..?

గర్భవతులైన స్త్రీలు పూజలు, వ్రతాలు అనేది చేయవచ్చా లేదా, ఆలయాలకు వెళ్లవచ్చా అనే విషయం ప్రతి ఒక్కరికి సందేహమే.

శాస్త్రం ప్రకారం గర్భిణీలు తేలికపాటి పూజలు చేయవచ్చు.

కానీ కొబ్బరికాయ వంటివి మాత్రం కొట్టకూడదని పండితులు అంటున్నారు.ముఖ్యంగా గుడి చుట్టూ ప్రదక్షిణలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, కొత్త పూజలు వంటివి ప్రారంభించకూడదు.

దేవుడి మందిరం వద్ద కూర్చొని ధ్యానం చేయవచ్చు.కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది.గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి లేదని అంటున్నారు.

Advertisement

ఐదో నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని పండితులు అంటున్నారు.పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఉద్దేశంతో ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది.

ఏదైనా కొండ మీద ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళకూడదట.అలా వెళ్లడం వల్ల మీరు ఏదైనా ప్రమాదంలో పడవచ్చని కొంతమంది పండితులు చెప్పుకొస్తున్నారు.

గర్భిణీలకు మూడు నెలలు దాటితే.ఆ ఇంటికి సంబంధించి ఎటువంటి మార్పులు చేయకూడదు, కొత్త నిర్మాణాలు చేయరాదు.

ఇలా చేస్తే గర్భంలో ఉండే శిశువు పైన ప్రభావం చూపిస్తాయని కొంతమంది పండితులు సూచిస్తున్నారు.

కనుమ రోజున పొలిమేర ఎందుకు దాటకూడదు..?
Advertisement

తాజా వార్తలు