తెలంగాణలో ఎన్నికలు( Telangana elections ) ముగిశాక ఏపీ రాష్ట్రంపై అందరి కళ్లు పడ్డాయి.అయితే ఏపీలో ఎలక్షన్స్ మరికొద్ది రోజుల్లో రాబోతున్న తరుణంలో అధికార వైసిపి పార్టీకి చెందిన కీలక నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ( Alla Ramakrishna reddy ) రాజీనామా చేయడం సంచలనగా మారింది.
రామకృష్ణారెడ్డికి జగన్ మోహన్ రెడ్డి ( Jagan mohan reddy ) టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.ఇక ఆయన కూడా స్వయంగా పార్టీకి రాజీనామా చేయడంతో రాజకీయాల్లో ఈ వార్త చర్చనీయాంశమైంది అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం వల్ల వైసీపీ పార్టీ కి నష్టం జరుగుతుందని భావించారు.
కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేయడంతోనే ఆయనను ఏ ఒక్కరు కూడా బుజ్జగించలేదు.
అంతేకాదు ఆయన ప్లేస్ లో మంగళగిరి (Mangalagiri) లో బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్చార్జిగా పెట్టారు.ఇక మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి ని నియమించే ముందే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే తన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేని సైతం జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి ఇంచార్జి బాధ్యతను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ఇవ్వడం చాలామంది బీసీ నాయకులకు సంతోషాన్నిచ్చింది.
అయితే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గానికి చెందిన చాలామంది సన్నిహితులను సైతం పక్కన పెట్టి ఇతర సామాజిక వర్గానికి చెందిన అంటే బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ, క్రిస్టియన్ ఇలా అన్ని సామాజిక వర్గాలను కవర్ చేసి వారికి కీలక భాద్యతలు అప్పజెప్పాలనే నిర్ణయం తీసుకున్నారట.అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాగే కీలక పదవులన్నీ ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు కట్టబెడితే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీ కి మంచి రిజల్ట్ ఉంటుందని అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు వైసిపి పై నమ్మకంతో భారీ మెజారిటీతో మళ్ళీ ఓట్లు వేసి ఎన్నికల్లో గెలిపిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక దీనికి ఉదాహరణగా మంగళగిరిలో తన సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి ( Ganji Chiranjeevi) ని ఇంచార్జిగా నియమించడాన్ని చెప్పుకోవచ్చు.