కింగ్ డమ్ సినిమాను రిజెక్ట్ చేసి రామ్ చరణ్ తప్పు చేశారా.. ఏం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

చరణ్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ అదే ఊపుతో గేమ్ చేంజర్( Game Changer ) సినిమాలో నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో విడుదలైన ఈ సినిమాకు ఊహించని విధంగా నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.ఫ్యాన్స్ ని ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.

ఇకపోతే ఇప్పుడు బుచ్చిబాబు సనా( Buchibabu Sana ) దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నారు చరణ్‌.

Did Ramcharan Made A Mistake By Rejecting Kingdom Movie Details, Ram Charan, Vij
Advertisement
Did Ramcharan Made A Mistake By Rejecting Kingdom Movie Details, Ram Charan, Vij

అయితే ఈ సినిమా కంటే ముందే మరో పాన్‌ ఇండియా మూవీ ఛాన్స్‌ని మిస్‌ చేసుకున్నారు.రామ్‌ చరణ్‌ 16వ సినిమా యు.వి.క్రియేషన్స్‌ నిర్మాణంలో గౌతమ్‌( Gowtam ) దర్శకత్వంలో రాబోతున్నట్టు అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేశారు.ఆ తర్వాత కొన్నాళ్ళకు ఈ ప్రాజెక్ట్‌ ను పక్కన పెట్టేశారు.

దానికి కారణం గౌతమ్‌ హిందీలో రీమేక్‌ చేసిన జెర్సీ( Jersey ) కమర్షియల్‌ గా వర్కవుట్‌ కాకపోవడమేనని ప్రచారం జరిగింది.అందులో ఎంత మాత్రం నిజం లేదని ఆ తర్వాత తేలింది.

అలాగే స్క్రిప్ట్‌ విషయంలో చరణ్‌ సంతృప్తిగా లేకపోవడంతో ప్రాజెక్ట్‌ ను ఆపేశారని కూడా చెప్పుకున్నారు.అయితే ఇది కూడా రూమర్‌ మాత్రమేనని తర్వాత తెలిసింది.

ఈ స్క్రిప్ట్‌ మీద గౌతమ్‌ నెలల తరబడి వర్క్‌ చేశారు.ఆ తర్వాత చరణ్‌ కి నేరేట్‌ చేశారు.

చలికాలం పొడిచర్మం ఇబ్బందా ? ఈ సలహాలు చూడండి

అది తన తండ్రి చిరంజీవి కూడా వినాలని చరణ్‌ చెప్పడంతో ఆయనకు కూడా ఆ స్క్రిప్ట్‌ ను వినిపించారట.కానీ చిరంజీవికి( Chiranjeevi ) ఈ కథ నచ్చలేదు.

Advertisement

దాంతో ఆ ప్రాజెక్ట్‌ ని పక్కన పెట్టేశారు.

అప్పుడు బుచ్చిబాబు సనాతో తన 16వ సినిమా కమిట్‌ అయ్యారు చరణ్‌.అలా కింగ్‌డమ్‌( Kingdom ) అనే సినిమా విజయ్‌ దేవరకొండ( Vijay Devarakonda ) వరకు వచ్చింది.ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఎంతో ఇంప్రెసివ్‌గా ఉందనే కామెంట్స్‌ వస్తున్నాయి.

ఈమధ్యకాలంలో హిట్‌ అనేది లేని విజయ్‌కి కింగ్‌డమ్‌ మంచి బ్రేక్‌ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా టీజర్‌ చూస్తుంటే చాలా బిగ్‌ రేంజ్‌ సినిమాలా కనిపిస్తోంది.

సినిమాలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ గానీ, బ్యాక్‌డ్రాప్‌గానీ, ఎమోషన్స్‌గానీ రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.ముఖ్యంగా విజయ్‌ గెటప్‌ చాలా కొత్తగా ఉండడమే కాకుండా అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా నెక్స్‌ట్‌ లెవల్‌ లో ఉందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

అయితే ఈ సినిమా విషయంలో చరణ్‌ తీసుకుని నిర్ణయం కరెక్టా కాదా అన్నది తెలియాల్సి ఉంది.ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం ఈ సినిమాలో చెర్రీ మిస్ చేసుకుని తప్పు చేశాడనే చెప్పాలి.

తాజా వార్తలు