మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటామనే ధీమాతో ఉన్న తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు టెన్షన్ పుట్టించే విధంగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prashant Kishor ) ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కు టెన్షన్ పుట్టిస్తుంది.తప్పకుండా ఈ ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతో ఉన్న కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ చాలా విషయాల్లోనే క్లారిటీ ఇచ్చారట.
కొద్ది రోజుల క్రితం కేసీఆర్, కేటీఆర్ తో ప్రశాంత్ కిషోర్ రహస్యంగా భేటీ అయిన సమాచారం బయటకు వచ్చింది.దీంతో అసలు ప్రశాంత్ కిషోర్ ను కేసీఆర్ ఎందుకు పిలిపించుకున్నారు ? ఏ ఏ విషయాలపై వారు చర్చించారు అనేది ఆ పార్టీ నేతలతో పాటు, తెలంగాణ రాజకీయ వర్గాలలోను ఆసక్తి నెలకొంది.అయితే వీరి భేటీకి ప్రధాన కారణం కూడా ఉంది.ప్రస్తుతం బీ ఆర్ ఎస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి నెలకొంది అని, అదీ కాకుండా, కాంగ్రెస్ గతంతో పోలిస్తే బాగా బలపడడం, కర్ణాటక ఎన్నికల ఫలితాల లో ఆ పార్టీ విజయం సాధించడం ఇవన్నీ తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వచ్చాయని ప్రశాంత్ కిషోర్ వివరించారట.

అంతేకాకుండా తెలంగాణలో తాజా పరిస్థితిపై ఫ్లాష్ సర్వే నిర్వహించి వచ్చిన వివరాలను కేసీఆర్ , కేటీఆర్( KCR, KTR) కు రిపోర్ట్ రూపంలో అందించారట. వాటిపై విశ్లేషణ కూడా చేశారట.బీఆర్ ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, కొన్ని ప్రాంతంలో మాత్రం సానుకూలత ఉందని, మరికొన్నిచోట్ల పరిస్థితిలో మార్పు వచ్చేందుకు అవకాశం ఉందనే విషయాన్ని వివరించారట.ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చినా , ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వాస్తవ పరిస్థితులను సంబంధించిన రిపోర్టును అందించారట.9 ఏళ్ల బీఆర్ఎస్( BRS party ) పాలనను చూసిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పీకే వివరించినట్లు సమాచారం.దీంతో పీకే చెప్పిన విషయాలతో కేసీఆర్ కాస్త కంగారే పడుతున్నారట.

గతంలో ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ కు పార్టీకి రాజకీయ వ్యూహాలు అందించే బాధ్యతలను అప్పగించారు.అయితే మధ్యలోనే ఆ ఒప్పందం రద్దు అయ్యింది.కెసిఆర్ ను మించిన రాజకీయ వ్యూహకర్త మరెవరూ లేరని, తమకు ఏ రాజకీయ వ్యూహకర్త అవసరం లేదని అప్పట్లోనే గొప్పగా ప్రకటించినా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో , ప్రశాంత్ కిషోర్ సలహాలను కేసీఆర్ కోరుతున్నారు.