టాలీవుడ్ లో చాలా మంది హీరోలు వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటు ఉంటారు.ఇక ఇలాంటి వాళ్లలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) ఒకరు.
ఈయన చేసిన సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఒక సినిమా చేశాడు అంటే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా మంచి అంచనాలు ఉంటాయి.ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ఒక సినిమా ను రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాడు అంటూ చాలా మంది ఆయన అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు.ఇక అది ఏ సినిమా అంటే తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రజనీకాంత్( Rajinikanth ) హీరోగా వచ్చిన ‘లింగా ‘ సినిమా…( Lingaa Movie ) ఈ సినిమాని మొదట ప్రభాస్ తో తెరకెక్కించాలనే ప్రయత్నం చేశారట.అయితే లింగా సినిమా స్టోరీ ప్రభాస్ కి ఏమాత్రం నచ్చకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
దాంతో ఆ సినిమాని రజినీకాంత్ తో చేసి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు.

ఇక ఈ సినిమా తమిళ్ తెలుగు రెండు భాషల్లో భారీ డిజాస్టర్ అయిందనే చెప్పాలి.అయితే ప్రభాస్ మాత్రం ఈ సినిమాని చాలా తెలివిగా తప్పించుకున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేశారు.ఇక నిజానికి ప్రభాస్ కి చాలా మొహమాటం ఉంటుంది.
కాబట్టి మొహమాటానికి పోయి సినిమా చేస్తాడేమో అని అందరు అనుకున్నారు.కానీ ఆ సినిమా నుంచి తప్పించుకొని భారీ డిజాస్టర్ నుంచి తను తాను సేవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా ఇచ్చిన షాక్ నుంచి రజనీకాంత్ కూడా చాలా రోజుల వరకు తేరుకోలేదనే చెప్పాలి.ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ పాన్ ఇండియా లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు…