ఉత్తరాంధ్ర రాజకీయ నేతలకు సాధారణంగా ఓ ప్రత్యేకత ఉంటుంది.ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా.
ఎలాంటి పదవిలో చలామణి అవుతున్నా ఎదుటి పార్టీ నేతలపై వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోరు.అయితే ప్రస్తుతం అలాంటి సంప్రదాయానికి తూట్లు పడుతున్నాయి.
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఎంతోమంది ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు ఉన్నారు.అయితే వారిలో బొత్స సత్యనారాయణ ముందుంటారు.
బొత్స సత్యనారాయణది మూడున్నర దశాబ్దాల రాజకీయం.విజయనగరం జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఇపుడు రాష్ట్ర స్థాయి నేతగా మారింది.బొత్స తూర్పు కాపు పైగా బీసీ.దాంతో బొత్స అటు కాపులకు ఇటు బీసీలకు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రతినిధిగా బలమైన వాయిస్ వినిపిస్తూ రాజకీయాల్లో ముందుకు సాగిపోతున్నారు.
ముఖ్యంగా బొత్స కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీడీపీలో చంద్రబాబును టార్గెట్ చేసేవాళ్లు తప్ప ఆయనకు లోకల్‌గా గట్టి ప్రత్యర్థిగా ఉన్న అశోక్ గజపతిరాజుపై ఎన్నడూ నోరుజారిన దాఖలాలు లేవు.
అయితే వైసీపీలోకి వెళ్లాక బొత్స తీరు మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏడాది కిందట అశోక్ గజపతిరాజును ఉద్దేశిస్తూ నోటికి ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విమర్శలు చేశారు.అచ్చెన్నాయుడు మీద కూడా విరుచుకుపడ్డారు.

అంతటితో ఆగకుండా గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు వంటి నేతల మీద కూడా బొత్స పదే పదే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.ఒకరకంగా బొత్ప కారణంగానే టీడీపీలోని అచ్చెన్నాయుడు లాంటి నేతలు కూడా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.విద్యా శాఖను ఒక మద్యం వ్యాపారి చేతుల్లో జగన్ ప్రభుత్వం పెట్టిందని బొత్సను ఉద్దేశిస్తూ అచ్చెన్నాయుడు విమర్శలు ఎక్కుబెట్టారు.గంటా కూడా తానేం తక్కువ కాదు అన్నట్లు బొత్సను చేతకాని మంత్రి ఎద్దేవా చేశారు.
దీంతో ఇప్పటిదాకా సహనం పాటించినట్లు కనిపించిన ఉత్తరాంధ్ర నేతలు పరస్పరం సహనం కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.