కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో డయేరియా ప్రబలుతోంది.కేరమెరి మండలం మురికిలంక తండాలో డయేరికా కేసులు నమోదైయ్యాయి.
తండాలో డయేరియా విజృంభిస్తుండటంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.పలువురు అస్వస్థతకు గురైయ్యారు.
దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవడం, మురుగునీటి కాల్వలు ఉండటం వలనే అతిసారం ప్రబలినట్లు తెలుస్తోంది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి డయేరియా ఇంకా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.