మడిసన్నాక కాసంత కళాపోషనుండాలా.ఈ డైలాగ్ చెప్పింది ఈ ముత్యాలముగ్గులోని విలన్ పాత్రధారి రావు గోపాల్ రావు.
ఈ సినిమా వచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ డైలాగు మాత్రం అందరూ సరదాకో సీరియస్ గానైనా అంటూ ఉంటారు.అంతలా ఒక డైలాగ్ అది కూడా విలన్ నోటి వెంట వచ్చిన డైలాగ్ మనల్ని ప్రభావితం చేసింది అంటే డైలాగ్స్ కి సినిమా లో ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఎంత మంచి కథకైనా కూడా అద్భుతమైన డైలాగ్స్ పడితేనే అది సూపర్ హిట్ అవుతుంది.ఒకప్పుడు ఆత్రేయ, జంధ్యాల, పరుచూరి బ్రదర్స్, సినారే, ముల్లపూడి వెంకటరమణ లాంటి అనేకమంది ఈ గొప్ప డైలాగ్స్ ఉండేవారు.

మరి ఇప్పుడు సినిమాకి సంబంధించిన అంతవరకు దర్శకుడు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అని అన్నీ నేమ్ కార్డ్ లో వేసుకుంటున్నాడు.పోనీ రాస్తున్న ఆ మాటలు ఏమైనా గొప్పగా ఉంటున్నాయి అంటే అది లేదు అక్షర జ్ఞానం ఉండదు.ఇంటర్ పాస్ అయి లేదంటే ఇంగ్లీష్ మీడియం చదివి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తో డైరెక్షన్ లోకి దూకుతూ వారి సినిమాకు వారే కథ రాసుకొని, మాటలు కూడా రాసుకుంటున్నారు.ఒకప్పుడు డైలాగ్ రైటర్స్ అనేవారు ఉన్నారు అని మన భావితరాలు చెప్పుకునే స్థితికి ఇప్పటి పరిస్థితి వచ్చింది.

పోనీ ఎంతో కొంత టాలెంట్ ఉన్నవారు డైలాగ్స్ రాయడానికి వద్దామా అనుకుంటే వారికి అవకాశం దొరకడం జరిగే పని కాదు.ఇండస్ట్రీ వారిని చిన్నచూపు చూస్తుంది.లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దూరిపోయి ఆఫీస్ బాయ్ కంటే ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్ కి తక్కువ అన్న విధంగా అలా కాలం గడిపేయాల్సి వస్తుంది.ఒక పింగళి, గణేష్ పాత్రో, Dv నరసరాజు వంటి వారి మాటలను సినిమాలలో చూసి సంబర పడటం తప్ప అలాంటి గొప్ప డైలాగ్ రైటర్స్ మళ్ళి పుట్టారు.
ఇక ఇప్పుడు వస్తున్న సినిమాలలో డైలాగ్స్ అంటే హీరో మాత్రం పంచ్ వేయాలి.విలన్ అప్పటిదాకా గడగడ పంచులు వేస్తూ ఉండి హీరోని చూడగానే గుటకలు మింగాలి.
అదండి ఇప్పటి సినిమాలో డైలాగ్ రైటర్ అవస్థ.







