చిక్కుల్లో ధోనీ!

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మనకు వింటేజ్‌ ధోని కనిపించిన సంగతి తెలిసిందే.ఫినిషర్‌ అనే పదానికి నిర్వచనం చెబుతూ పలుమార్లు మంచి ఇన్నింగ్స్‌లతో మెరిశాడు.

 Dhoni In Trouble , Ms Dhoni, Viral Latest, News Viral, Social Media, Viral, Spo-TeluguStop.com

ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో అయితే ధోని తన దనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించాడు.వరుస ఓటములతో డీలా పడిన సీఎస్‌కే ఈ సీజన్‌లో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది.

ఈ విషయం పక్కనబెడితే.బీహార్‌లోని బెగుసరాయ్‌లో కెప్టెన్ కూల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఈ కేసులో ధోనీతో పాటు మరో ఏడుగురు నిందితులుగా ఉన్నారు.

ధోనీతో పాటు మరో ఏడుగురు ఎరువుల విక్రేతలపై ఈ కేసు పెట్టారు.రూ.30 లక్షల చెక్కు బౌన్స్ కేసులో ఈ కేసు నమోదైంది.నిజానికి ఇది రెండు కంపెనీల మధ్య వివాదం.ఒక ఎరువుల కంపెనీ తన ఉత్పత్తి విక్రయం కోసం ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ బెగుసరాయ్ అనే ఏజెన్సీతో పార్ట్నర్ షిప్ కలిగి ఉంది.

కంపెనీ తరపున ఎరువులను ఏజెన్సీకి పంపించినా.అక్కడి నుంచి మార్కెటింగ్‌కు సహకరించలేదు.ఉత్పత్తిని విక్రయించే క్రమంలో కంపెనీ తమకు సహకరించలేదని, దీని వల్ల భారీ మొత్తంలో ఎరువులు అమ్ముదవ్వలేదని ఆరోపించారు.దీని తరువాత, ఏజెన్సీ యజమాని నీరజ్, కంపెనీ సహకరించడం లేదని ఆరోపించాడు.

దీని వల్ల తనకు నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత కంపెనీ మిగిలిన ఎరువులను వెనక్కి తీసుకుంది.

ప్రతిఫలంగా, రూ.30 లక్షల చెక్కును కూడా వారి ఏజెన్సీ పేరు మీద ఇచ్చారు.కానీ అది బౌన్స్ అయింది.దీని తర్వాత కంపెనీ సీఈవో రాజేష్ ఆర్యతో పాటు కంపెనీకి చెందిన మరో ఏడుగురు ఆఫీస్ బేరర్లపై కేసు నమోదైంది.కాగా, ఈ ప్రొడక్ట్‌కు మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.కాబట్టి అతని పేరు కూడా ఫిర్యాదులో నమోదు చేశారు.

ఈ వ్యాజ్యాన్ని స్వీకరించిన కోర్టు దీనిపై తదుపరి విచారణ జూన్ 28న జరగనుంది.ఈ కేసులో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరును చేర్చడంతో ఈ కేసు వార్తల్లో నిలిచింది.

Telugu Dhoni, Msdhoni, Latest-Latest News - Telugu

అయితే.తాజాగా రాంచీ ఎయిర్‌పోర్ట్‌లో ధోని తన అభిమాని లావణ్య పిలానియా కలుసుకొని ఆమెను సంతోషంలో ముంచెత్తాడు.పుట్టుకతోనే అంగవైకల్యం బారిన పడిన లావణ్య ధోని అంటే విపరీతమైన అభిమానం.అందునా ధోని బొమ్మను గీసి అతనికి కానుకగా ఇవ్వాలని భావించింది.ఈ సందర్భంగా లావణ్య తాను గీసిన బొమ్మను ధోనికి చూపించింది.కాగా ధోని లావణ్య చేతులను దగ్గరికి తీసుకోవడం.

కన్నీళ్లను తుడవడం.తన బొమ్మ గీసినందుకు అభినందించడం లావణ్యకు తెగ సంతోషం కలిగించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube