చిరు టైటిల్స్‌ను అడ్డదొడ్డంగా వాడేస్తున్న తమిళ తంబీలు

ఇటీవల విడుదలవుతున్న తమిళ సినిమాలను గమనించినట్లయితే వాటికి పెట్టే తెలుగు టైటిల్స్‌లో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల పేర్లను వాడుకుంటున్న విషయం మనకు స్పష్టం అవుతుంది.ఇప్పటికే తమిళ హీరో కార్తీ ఖైదీ చిత్రంతో సూపర్ హిట్ అందుకుని వెంటనే దొంగ అనే సినిమాతో ఇలా వచ్చి అలా వెళ్లాడు.

 Dhanush To Use Chiranjeevi Title Rustum-TeluguStop.com

ఈ రెండు సినిమాలకు కార్తీ వాడుకున్నవి చిరంజీవి నటించిన సినిమా టైటిళ్లే.

ఇకపోతే ఇప్పుడు మరో తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రానికి కూడా చిరు చేసిన సినిమా టైటిల్‌నే వాడబోతున్నట్లు తెలుస్తోంది.

ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పటాస్.ఈ సినిమాను తెలుగులో రుస్తుం అనే టైటిల్‌తో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.పూర్తి యాక్షన్ ప్యాక్ మూవీగా రానున్న ఈ సినిమాలో ధనుష్ ఓ కొత్త లుక్‌లో కనిపిస్తాడు.

Telugu Chiranjeevi, Dhanush, Pattas, Rustum, Telugu-

అయితే రుస్తుం కూడా చిరంజీవి నటించిన సినిమాయే.1984లో రిలీజ్ అయిన ఈ యాక్షన్ డ్రామా తెలుగు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.కాగా ధనుష్ రుస్తుం/పటాస్ చిత్రంలో డ్యుయల్ రోల్‌ చేయనున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ స్నేహ, మెహ్రీన్ పీర్జాదా కూడా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను దురై సెంథిల్‌కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

మరి చిరు టైటిల్‌తో రానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube