రియల్ ఇన్సిడెంట్ తో శేఖర్ కమ్ముల ప్రయోగం.. ధనుష్ కు హిట్ ఇస్తాడా?

మన టాలీవుడ్ డైరెక్టర్లలో ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న డైరెక్టర్లలో శేఖర్ కమ్ముల( Sekhar Kammula ) ఒకరు.

ఈయన ముందు నుండి డిఫరెంట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు.

కుటుంబం మొత్తం కలిసి కూర్చుని చూసే విధంగా ఈయన సినిమాలు ఉంటాయి.ఒక హ్యాపీ డేస్.

.ఒక ఫిదా.ఒక లవ్ స్టోరీ.

ఇలా ఎన్నో సినిమాలు ఈయన ఖాతాలో సూపర్ హిట్ అయ్యాయి.

Advertisement

ఈ సినిమాలు ఎన్నిసార్లు చూసి బోర్ కొట్టవు.ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను సెట్ చేస్తున్నారు.కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ( Dhanush ) చేసి బ్లాక్ బస్టర్ అందుకుని తెలుగులో కూడా ఫాలోయింగ్ పెంచుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమాను స్టార్ట్ చేయనున్నారు.ప్రస్తుతానికి D51 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ధనుష్ సరసన హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.ఇటీవలే నాగార్జున( Nagarjuna ) కూడా ఈ సినిమాలో భాగం అయినట్టు తెలిపారు.

దీంతో ఇది మల్టీ స్టారర్ అని తేలిపోయింది.దీంతో ఇప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా స్టోరీ గురించి ఇప్పుడొక వార్త వైరల్ అయ్యింది.ఈ సినిమాను శేఖర్ కమ్ముల ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ప్లాన్ చేసినట్టు టాక్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

పీరియాడిక బ్యాక్ డ్రాప్ లో పొలిటికల్ డ్రామాగా ప్లాన్ చేస్తుండగా ఈ కాంబో ఎలా హిట్ అవుతుందో చూడాలి.ఇక ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ వారు LLP బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు