చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ గజ విజయవంతం అయింది.ఒంటరి ఏనుగును ఫారెస్ట్ ఆఫీసర్స్ బంధించారు.
ఈ క్రమంలో గుడిపాల మండలం రామాపురం వద్ద అటవీశాఖ సిబ్బంది ఏనుగును బంధించారు.శిక్షణా ఏనుగులతో పాటు మదపుటేనుగుల సాయంతో ఒంటరి ఏనుగును మచ్చిక చేసుకుని నిర్బంధించారు.
అదేవిధంగా బంధించిన ఒంటరి ఏనుగును జూ పార్క్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో బీభత్సం సృష్టించిన గజరాజు ఇద్దరిపై దాడి చేసి చంపేసింది.
ఇవాళ చిత్తూరు -తమిళనాడు సరిహద్దులోని ఓ గ్రామానికి చెందిన మహిళను తొక్కి చంపేసింది.వరుసగా దాడులకు పాల్పడుతున్న ఏనుగును అటవీశాఖ అధికారులు బంధించడంతో సమీప గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.







