నేటినుంచి ధనుర్మాసం ప్రారంభం.. ధనుర్మాసం అంటే ఏంటో తెలుసా?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలు కూడా ఎంతో పవిత్రమైన మాసాలుగా భావించి పెద్ద ఎత్తున ఆ నెలలో చేయాల్సిన వ్రతాలు పూజలు ఎంతో సక్రమంగా నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే నేడు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

ఈ క్రమంలోనే ఈ నెలలో పెద్ద ఎత్తున విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజ చేస్తూ అమ్మ వారి ఆశీస్సులు పొందుతారు.ఈ ధనుర్మాసం మొత్తం ప్రతి రోజు పూజలు, వ్రతాలు, జపాలు చేయడం మంచిదని శాస్త్రం చెబుతోంది.

ఎంతో పవిత్రమైన ఈ ధనుర్మాసంలో సూర్యుడు మకర సంక్రాంతి రోజు మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాసం కొనసాగుతుంది కనుక ఈ రోజులన్ని పెద్ద ఎత్తున ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది.ఈ క్రమంలోనే ఈ ధనుర్మాసం మొత్తం భక్తులు సూర్యుడి ఆలయానికి విష్ణు ఆలయానికి సందర్శించి పెద్దఎత్తున పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రపరిచి దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది.

Dhanurmasam Starts Today Do You Know What Dhanurmasam Means Details, Dhanurmasa
Advertisement
Dhanurmasam Starts Today Do You Know What Dhanurmasam Means Details, Dhanurmasa

ధనుర్మాసం అంటే దివ్యమైన ప్రార్థనలకు అనువైన నేల అని అర్థం.ఈ క్రమంలోనే ఈ ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తుంది.తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు.

స్వామి వారి సహస్రనామార్చనలో భాగంగా తులసీ దళాలకు బదులుగా బిల్వ దళాలను ఉపయోగించి అర్చన చేస్తారు.ఇలా ఈ నెల మొత్తం ఎంతో మంది భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారి పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ పెద్ద ఎత్తున స్వామి వారి అనుగ్రహాన్ని పొందుతుంటారు.

Advertisement

తాజా వార్తలు