యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర సినిమా( Devara ) మొదటి పార్ట్ షూటింగ్ దాదాపుగా 80 శాతం పూర్తి అయ్యింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ఇప్పటి వరకు మాట్లాడుకున్నారు.ఇప్పుడు దేవర సినిమాకు నిర్మాత అయిన కొరటాల శివ కూడా తన డెవిల్ సినిమా( Devil Movie ) ప్రమోషన్ లో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చాలా కాలంగా షూటింగ్ తో ఉన్న దేవర సినిమా ను ఎట్టకేలకు ముగింపు దశకు తీసుకు వచ్చారు అంటున్నారు.దేవర సినిమా గురించిన విషయాలను హీరో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) చెప్పుకొచ్చాడు.
దేవర సినిమా కి సంబంధించిన షూటింగ్ 80 శాతం వరకు పూర్తి అయింది.

కచ్చితంగా విడుదల తేదీ ప్రకటించిన సమయం కు విడుదల చేసి తీరుతాం అన్నట్లుగా ప్రకటించాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన దేవర సినిమా లో హీరోయిన్ గా జాన్వీ కపూర్( Janhvi Kapoor ) నటిస్తున్న విషయం తెల్సిందే.దేవర సినిమా గురించి డెవిల్ ప్రమోషన్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… దేవర ను ఎప్పుడు చూడనంత గ్రాండ్ గా విజువల్ ట్రీట్ తో ఉంటుంది.
విడుదల తేదీ పై ఫుల్ క్లారిటీగా ఉన్నాం.ఎలాంటి అనుమానం అక్కర్లేకుండా విడుదల అవుతుంది.

ఒక సన్నివేశం కోసం భారీ సంప్ తవ్వాల్సి వచ్చింది.రెండో భాగం కు సంబంధించిన సింగిల్ సీన్ కూడా షూట్ చేయలేదు.మొదటి పార్ట్ పూర్తి అయిన తర్వాత మాత్రమే రెండో పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్లుగా నిర్మాత అయిన కళ్యాణ్ రామ్ ప్రకటించాడు.కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా ఈ వారం లో విడుదల అవ్వబోతుంది.
సినిమా లో హీరోయిన్ గా సంయుక్త మీనన్( Samyuktha Menon ) నటించింది.సినిమా పై భారీగానే అంచనాలు ఉన్నాయి.మరి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.