పెళ్లి పీటలు ఎక్కబోతున్న దేవి శ్రీ ప్రసాద్... మరోసారి వైరల్ అవుతున్న పెళ్లి న్యూస్... నిజమెంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

వరుస సినిమా అవకాశాలను అందుకుంటు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టిన ఇంకా ఈయన పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు.

అయితే గతంలో ఈయన ఒక హీరోయిన్ తో పీకల్లోకి ప్రేమలో మునిగారని హీరోయిన్ తో బ్రేకప్ రావడం వల్లే పెళ్లి ఊసే ఎత్తడం లేదని తెలుస్తోంది.

ఇలా పెళ్లి గురించి ఈయన ఆలోచించకపోయినా తరచూ ఈయన పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి ఇదివరకే దేవిశ్రీప్రసాద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తాజాగా మరోసారి ఈయన పెళ్లి(Marriage) వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దేవిశ్రీప్రసాద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఈయన వరుసకు మరదలు అయ్యే తమ దూరపు బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.

ఇకపోతే ఈ అమ్మాయి దేవిశ్రీప్రసాద్ కన్నా వయసులో దాదాపు 17 సంవత్సరాలు చిన్నది కావడం గమనార్హం.ఇలా ఇద్దరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరి పెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది.ఇలా దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఇంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలిసే అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మరి దేవిశ్రీ పెళ్లి విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే ఈ పెళ్లి వార్తలపై దేవిశ్రీ లేదా ఆయన కుటుంబ సభ్యులు స్పందించి క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు