టాలీవుడ్ రౌడీ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ).రోజు రోజుకూ ఆయన అభిమానుల సంఖ్య పెరిగి పోతుంది.
విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.
విజయ్ ప్రస్తుతం ఖుషీ తో వచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.
ఎందుకంటే గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలన్నీ గల్లంతు చేసాయి.దీంతో నెక్స్ట్ చేసిన ఖుషీ సినిమా మీదనే విజయ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు.తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు.ఇదిలా ఉండగా విజయ్ సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేస్తూ పోతున్నాడు.
తాజాగా సోషల్ మీడియాలో విజయ్ మరొక మైల్ స్టోన్ చేరుకున్నాడు.ఇటీవలే ప్రముఖ సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన వాట్సాప్ ఛానెల్స్ ( WhatsApp Channel )అనే కొత్త అప్డేట్ ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.
దీంతో విజయ్ కూడా ఈ ఛానెల్స్ లో తన ఛానెల్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఈ ఛానెల్ కూడా విజయ్ కు సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది.
ఈ ఛానెల్ కు ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను దాటేయగా ఇంత తక్కువ సమయంలో ఈ రికార్డును సెట్ చేసిన ఫస్ట్ ఎవర్ టాలీవుడ్ హీరోగా విజయ్ నిలిచాడు.దీంతో ఆయన ఫ్యాన్స్ ఈ విషయంలో తెగ ఆనంద పడుతున్నారు.ప్రస్తుతం విజయ్ తన నెక్స్ట్ సినిమాను గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో చేస్తున్నాడు.దిల్ రాజు( Dil raju) నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.