తమిళ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం జైలర్( Jailer ).తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతో పాటు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఆగస్టు 10 విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది.కాగా ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikantth ) టైటిల్ రోల్ పోషించగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు.
రమ్య కృష్ణన్, మర్నామీనన్, వసంత్ రవి, విజయకన్, వీటీవీ గణేష్, యోగి బాబు, శివరాజ్ కుమార్, మోహన్ లాల్ జాకీ శ్రాఫ్ లు కీలక పాత్రలు పోషించారు.
అనిరుధ్ రవిచందర్( Anirudh Ravichander ) సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా( Tamannaah ) నటించిన విషయం తెలిసిందే.అయితే తమన్నా లవర్ గా నటించిన బాలు అసలు పేరు సునీల్ రెడ్డి.
ఆయన ఎవరో చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ టాలీవుడ్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి( Director Kodanda Ramireddy ) మాత్రం అందరికి సుపరిచితమే.
కోదండరామిరెడ్డికి సునీల్ రెడ్డికి మధ్య సంబంధం ఏంటా అనుకుంటున్నారా.సునీల్ మరెవరో కాదు కోదండరామిరెడ్డి కుమారుడే.
చాలా మందికి ఈ విషయం తెలియదు.జైలర్ సినిమాతో సునీల్ రెడ్డి( Sunil Reddy ) తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు.తన యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ప్రేక్షకులని కూడా మెప్పించారు.ఆయన సోదరుడు పేరు వైభవ్ రెడ్డి.వైభవ్ రెడ్డి( Vaibhav Reddy ) కూడా తెలుగు నాట లీడ్ యాక్టర్ గా నటించారు.కాగా కోదంద రామిరెడ్డి అప్పట్లో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఇకపోతే జైలర్ సినిమాలో హీరోయిన్గా నటించిన తమన్నా విషయానికి వస్తే.ప్రస్తుతం తమన్నా వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.