Chandrababu Naidu : పొత్తులు ఉన్నా… టీడీపీ అభ్యర్థులను ఖారారు చేసేస్తున్న చంద్రబాబు 

ఒకవైపు బిజెపి( BJP )తో పొత్తు చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలో టిడిపి , జనసేన కూటమితో కలిసి నడిచేందుకు బిజెపి సముఖంగానే ఉన్నా.ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఇది ఎలా ఉంటే బిజెపితో పొత్తు ప్రతిపాదన లేకపోయి ఉంటే టిడిపి, జనసేన అభ్యర్థుల ప్రకటన ఈపాటికి పూర్తయి ఉండేది.ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీ 6 విడతలుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించింది .దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.దీంతో టిడిపి జనసేన కూడా తమ పార్టీ తరఫున వీలైనంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేసి, ఎన్నికల ప్రచారంలోకి దిగాలని చూస్తున్నాయి.

ఇది ఎలా ఉంటే ఒకవైపు బిజెపితో పొత్తు వ్యవహారంపై చర్చలు జరుగుతున్నా.జనసేనతో ఇప్పటికే పొత్తు ఖరారైనా.టిడిపి అధినేత చంద్రబాబు కొన్నికొన్ని కీలక నియోజకవర్గల్లో పార్టీ తరపన పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారు.

Advertisement

ఇప్పటికే టిడిపి సీనియర్లను చాలా చోట్ల తప్పించే ఆలోచనలో ఉన్నారు.అయితే వారు మాత్రం ఖచ్చితంగా తాము ఎన్నికల్లో పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటిస్తూ.

ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు కేటాయించి వద్దంటూ బాబుపై ఒత్తిడి చేస్తున్నారు.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జిల్లాల పర్యటనలో కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.చంద్రబాబు సైతం అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలుపెట్టారు.ముఖ్యంగా వైసిపి కి పట్టున్న ప్రాంతాల్లో ఆచితూ వ్యవహరిస్తున్నారు.

పెనుకొండ మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధిని ఈసారి అనంతపురం లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయించాలని నిర్ణయించుకున్నారు.గతంలో ఈయన హిందూపురం ఎంపీగాను పనిచేశారు.అలాగే హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు( Kalava Srinivasul ) పేరును పరిశీలిస్తున్నారు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఆయన మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు అనిల్ ను అభ్యర్థిగా ఖరారు చేశారు .సింగనమలలో మహిళ నేత బండారు శ్రావణి పేరును ఖరారు చేశారు.

Advertisement

ఈ జిల్లాలో మిత్రపక్షలతో పొత్తుల కారణంగా మూడు సీట్లకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్ లో పెట్టారు.ఈ జిల్లాలో జనసేన పుట్టపర్తి లేదా అనంతపురం అర్బన్ సీట్ ఇవ్వాలని కోరుతోంది.బిజెపి ధర్మవరం సీటును ఆశిస్తోంది.

గతంలో ఇక్కడ టిడిపి నుంచి గెలిచిన వరదాపురం సూరి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కదిరిలో ప్రస్తుత ఇన్చార్జి కందికుంట వెంకటప్రసాద్ పోటీ చేసే ఆలోచనతో ఉన్నా.

ఆయనకు న్యాయపరమైన చిక్కులు రావడంతో పెండింగ్ లో పెట్టారు.ఇక కళ్యాణదుర్గంలో పారిశ్రామిక వేత్త సురేంద్రబాబుకు వ్యతిరేకంగా ఇద్దరు ప్రధాన పోటీదారులు ఉమామహేశ్వర నాయుడు ,పొన్నం హనుమంతరాయ చౌదరి వర్గాలు ఏకమయ్యాయి.

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎస్సి నియోజకవర్గానికి అభ్యర్థిగా రోషన్ కుమార్ ను నియమించినట్లుగా టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్ననాయుడు( Atchannaidu ) నిన్ననే ప్రకటించారు.కడప జిల్లా ప్రొద్దుటూరులో బిజెపి  ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సురేష్ టికెట్ ఆశిస్తున్నారు.

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చినా, స్థానిక నాయకులు మాత్రం జయ చంద్రారెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు.

తాజా వార్తలు