తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు విజయ్ సేతుపతి.
ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా స్వయంకృషితో ఎదిగి నటుడిగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు.ప్రస్తుతం ఒకవైపు తెలుగు సినిమాలలో( Telugu Movies ) నటిస్తూనే మరొకవైపు తమిళం సినిమాలలో కూడా నటిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఈయనకు సినిమా అవకాశాలు ఒక దాని తర్వాత ఒకటి వరసగా క్యూ కడుతున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ. జూనియర్ ఆర్టిస్టుగా( Junior Artist ) వచ్చాను.సింగిల్ డైలాగ్ కేరక్టర్లు కూడా చేశాను.ఇప్పుడు హీరోగా చేస్తున్నాను.
ఏం చేసినా ఎంత ఎదిగినా.చివరి లక్ష్యం మాత్రం ఒక్కటే.
నటుడిగా కొన్నేళ్లపాటు నన్ను ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి అంతే అని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.అలాగే మనం ఒకటి అవ్వాలి అనుకున్నప్పుడు,ఆ కోరికను బలంగా అనుకోవాలి.
మనస్ఫూర్తిగా కోరుకోవాలి.తగిన ప్రయత్నాలు చేయాలి.

మన కోరికలో నిజాయితీ ఉంటే, లక్ష్యం సరైనదే అయితే.ఆ కోరికను తీర్చడానికి దేవుడెప్పుడూ రెడీగా ఉంటాడు.నేను చిన్నప్పటీ నుంచీ యాక్టర్ కావాలని కలలు( Dreams ) కన్నాను.బలంగా కోరుకున్నాను.ఆ కోరికే నన్ను లక్ష్యం వైపు నడిపించింది.ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది.
ఒకవేళ మనం అనుకున్నది నెరవేరట్లేదు అంటే, మన ప్రయత్నంలో లోపం ఉన్నట్టే.లక్ష్యంపై మనసు లగ్నం చేయనప్పుడు ప్రకృతికి కూడా సహకరించదు అని తెలిపారు విజయ్ సేతుపతి.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారాయి.