బీఆర్ఎస్ పై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అవాకులు చెవాకులు పేలుతోందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగేలా మరికొద్ది రోజుల్లో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.ఉద్యోగాల నియామకాల కోసం టీఎస్పీఎస్సీ ( TSPSC )ప్రక్షాళన మొదలైందని తెలిపారు.ఛైర్మన్ తో పాటు కమిటీ సభ్యుల నియామకం పూర్తి చేశామని వెల్లడించారు.పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామని పేర్కొన్నారు.రాష్ట్రంపై లక్ష కోట్ల అప్పులభారం మోపారని ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉండాలని తెలిపారు.