25 వేల కోళ్లను చంపాలని ఆదేశించిన ప్రభుత్వం... కారణం ఇదే

ప్రపంచ దేశాలన్నీ కనిపించని కరోనా వైరస్ తో యుద్దం చేస్తున్నాయి.దీనికి తోడుగా సీజనల్ వ్యాధులు కూడా జనాలను వేధిస్తున్నాయి.

దీనితో జనాలు తీవ్ర భయాదోంళనలకు గురవుతున్నారు.కాగా ఇప్పటికే కరోనాతో చాలా మంది ఆస్పటళ్ల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ వైరస్ తన ప్రభావాన్ని రోజు రోజుకూ పెంచుతూనే ఉంది.ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కాని కరోనా వైరస్ సోకుతూనే ఉంది.

ఇదిలా ఉంటే కరోనా ఇటు కరోనా వైరస్, అటు సీజనల్ వ్యాధులతో జనాలు సతమతవుతుంటే మరోపక్క మరో కొత్త రోగం జనాలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తోంది.కొత్తగా వచ్చిన ఈ ఫ్లూ మూలంగా ఎంత ప్రమాదం పొంచి ఉందోనంటూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Serum Institute Tests,Seasonal Diseases,bird Flu , Denmark,kill 25 Thousand Chic

అయితే డెన్మార్క్ దేశంలో కొత్తగా బర్డ్ ఫ్లూ వచ్చినట్టు తెలిసింది.మధ్య జట్లాండ్లోని ట్రస్ట్ రప్ లోని రాండర్స్ పట్టణంలోని కోళ్లకు హెచ్ 5 ఎన్ 8 అనే బర్డ్ ఫ్లూ సోకిందని తేల్చి చెప్పారు.

Serum Institute Tests,seasonal Diseases,bird Flu , Denmark,kill 25 Thousand Chic

ఈ విషయాన్ని సీరం ఎన్ స్టిట్యూట్ పరీక్షల్లో నిర్ధారించారు.డెన్మార్క్ లో ఇది మరింత విజృంబించకుండా ఉండేందుకు నివారణా చర్యలుగా ఆ ఫ్లూ సోకిన 25 వేల కోళ్లను చంపేందుకు చర్యలు తీసుకున్నారు.ఈ నిర్ణయాన్ని ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వశాఖ, పశుసంవర్ధక, ఆహార శాఖ తీసుకుంది.

వెటర్నరీ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ విషయాన్ని తెలియజేసింది.కాగా జట్లాండ్ ప్రాంతంలోని అడవుల్లోని పక్షుల్లో ఈ ఫ్లూని కనుగొన్నట్టు తెలిపారు.

అలాగే ఏవియన్ ఇన్ఫ్లఎంజా(బర్డ్ ఫ్లూ) H5N8 జాతి వైరస్ జర్మనీ, ఫ్రాన్స్, ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు విస్తరించి కలకలం రేపుతోంది.దీని నివారణా చర్యలను కూడా అక్కడి ప్రభుత్వం కఠినంగానే చేపట్టింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

కాగా ఈ ఫ్లూ ఇప్పటి వరకు పశు పక్షాదులకే సోకిందని, మనుషులకు మాత్రం ఈ ఫ్లూ ఇప్పటివరకు సోకలేదని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు