రక్త పిశాచుల మధ్య రుచికరమైన భోజనం!

భయం కూడా ఒక మంచి థ్రిల్‌ను అందిస్తుంది.అందుకే హారర్ సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.

 Delicious Meal Among Vampires , Riyadh In Saudi Arabia , Shadows , Resturant ,-TeluguStop.com

హారర్ సినిమాలు మాత్రమే కాదు దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు, ప్రదేశాలు కూడా ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.అయితే ప్రజలలోని ఈ వీక్ నెస్ ని తమ వ్యాపారానికి పెట్టుబడి పెట్టాడు ఒక రెస్టారెంట్ యజమాని.

తమ రెస్టారెంట్‌లో రక్త పిశాచుల మధ్య తిండి తింటూనే భయపడచ్చొని, మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ పొందొచ్చని యజమాని బంపర్ ఆఫర్ ప్రకటించాడు.దీంతో హారర్ లవర్స్ అందరూ ఈ రెస్టారెంట్ కి క్యూ కడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.సౌదీ అరేబియాలోని రియాద్‌లో కొద్దిరోజుల క్రితమే ‘షాడోస్‌‘ అనే రెస్టారెంట్‌ ప్రారంభమైంది.ఆ రెస్టారెంట్‌ బయటి నుంచి అన్ని రెస్టారెంట్‌ల మాదిరిగానే సాధారణంగా కనిపిస్తుంది.కాస్త దగ్గరకు వెళితే మాత్రం అద్దాల్లోంచి దెయ్యాల నీడలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి.

రెస్టారెంట్‌పైన చింతనిప్పుల్లా ఎర్రగా మెరిసే కళ్లతో గబ్బిలాల బొమ్మలు కనిపిస్తాయి.ఇవి ఆ రెస్టారెంట్‌కు వెళ్లే కస్టమర్లను బాగా భయపెడతాయి.

Telugu Meal, Horror Lovers, Restaurant, Resturant, Riyadhsaudi, Shadows, Latest-

ఒక దెయ్యాల కొంపలాగా ఉండే ఈ రెస్టారెంట్‌లోకి వెళ్లేందుకు కస్టమర్లు చాలా బెదిరిపోతుంటారు.లోపలికి అడుగుపెట్టాక మసక చీకటిలో జాంబీస్‌, రక్త పిశాచులు, వింత దెయ్యాలు రెస్టారెంట్‌లో విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.ఇలాంటి భయంకరమైన ఆకారాలు చుట్టూ తిరుగుతుంటే ఆహారం తినాల్సి ఉంటుంది.అయితే ఎంత ధైర్యం ఉన్నా కూడా ఈ రెస్టారెంట్ లోకి వస్తే భయపడక తప్పదని కస్టమర్లు అంటున్నారు.

రెస్టారెంట్ వాతావరణం అలవాటైతే మాత్రం టేస్టీ ఫుడ్ హాయిగా ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు.ఏదిఏమైనా ఈ క్రేజీ ఐడియా బాగా వర్కౌట్ అవ్వడంతో కస్టమర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

రక్త పిశాచుల మధ్య భోజనం చేసేందుకు కస్టమర్లు బాగా ఆసక్తి కనబరుస్తున్నారని, కస్టమర్లు తాకిడి పెరుగుతోందని యజమాని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube