ఢిల్లీ లిక్కర్ స్కాం : నేడు ప్రగతి భవన్ లో వారందరితో కవిత చర్చలు ?

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్(BRS) కు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది.నిన్ననే అధికారులు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలో విచారించారు .

 Delhi Liquor Scam: Today In Pragati Bhavan  Kavitha Discussions With All Of Them-TeluguStop.com

మరోసారి 16వ తేదీన విచారణకు రావాల్సిందిగా సూచించారు.నిన్న ఈడి అధికారులు కవితను(MLC Kavitha) ఏ ఏ అంశాల గురించి ప్రశ్నించారు అనే దానిపై రకరకాల ప్రచారాలు  జరుగుతున్నాయి .నిన్ననే కవితను అరెస్ట్ చేస్తారనే హడావుడి జరిగినా,  అరెస్టు చోటు చేసుకోకపోవడంతో , బిఆర్ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు .సాయంత్రం ఎనిమిది గంటలకు విచారణ పూర్తి కావడంతో కవిత బయటికి వచ్చారు.రాత్రి ఢిల్లీలోని తన నివాసం వద్దకు చేరుకున్నారు.అక్కడి నుంచి కవిత మంత్రులతో సహా రాత్రి 9 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు  బయలుదేరారు.రాత్రి 11వ తర్వాత హైదరాబాద్ కు వారంతా చేరుకున్నారు.

కవిత , కేటీఆర్,  హరీష్ రావు (Harish Rao)నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు.ఆదివారం కూడా వీరంతా ప్రగతి భవన్ లోనే ఉండనున్నట్లు సమాచారం .ఈడి అధికారుల విచారణపై న్యాయ నిపుణులతో చర్చించబోతున్నట్లు సమాచారం .ఈ చర్చల్లో ఖమ్మం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే కుమారుడు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

ఇతడు రెవెన్యూ శాఖలో కీలక అధికారిగా పనిచేస్తున్నారు.గతంలో కవితను విచారించిన సమయంలో ఇతనే సలహాలు సూచనలు ఇవ్వడంతో ఇప్పుడు కూడా ఆయనను పిలిపించుకుని మార్చి 16వ తేదీన ఈడి అధికారులు అడిగే ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పాలి అనే విషయాల పైన చర్చించబోతున్నట్లు సమాచారం.అయితే ప్రగతి భవన్ లో కవిత, కేటీఆర్ , హరీష్ రావు,  కేసీఆర్ వంటి వారు మాత్రమే ఉంటారని , దరిదాపుల్లోకి మంత్రులను కూడా రానివ్వకపోవడంతో  అక్కడ ఏం జరుగుతుందనే ఉత్కంఠ బీఆర్ఎస్ నాయకుల్లోనూ మొదలైంది.

ఏది ఏమైనా కవిత ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi liquor scam) లో ఏదో రకంగా కవిత నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube