ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో( Delhi Liquor Scam Case ) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను( BRS MLC Kavitha ) ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట హాజరుపరిచారు.ఈ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ఇవాళ్టితో ముగిసింది.
ఈ క్రమంలో ఆమెను కోర్టు ఎదుట హాజరుపరిచిన ఈడీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించాలని కోరింది.లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మార్చి 26 నుంచి ఆమె తీహార్ జైల్లో( Tihar Jail ) ఉన్నారు.కాగా ఇదే కేసులో కవిత మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
అలాగే కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16న కోర్టులో విచారణ జరగనుంది.