ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు అయింది.ఈ మేరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ కు న్యాయస్థానం కస్టడీని పొడిగించింది.
ఈ క్రమంలో మే 7వ తేదీ వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court )కీలక ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా లిక్కర్ పాలసీ కేసులోనే చన్ ప్రీత్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ కూడా పొడిగింపు అయింది.
ఈ నేపథ్యంలో చన్ ప్రీత్ సింగ్ వచ్చే 7 వరకు కస్టడీలో ఉండనున్నారు.అయితే లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.







