ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi liquor scam case )లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )ను ఈడీ ఏడో రోజు కస్టడీలోకి తీసుకోనుంది.
ఈ మేరకు కేజ్రీవాల్ సహా ఇతర నిందితులు, వ్యాపారులు, అధికారులను లిక్కర్ వ్యాపారం, మనీలాండరింగ్ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అక్రమాల్లో కేజ్రీవాల్ దే ప్రధానపాత్ర అని ఈడీ చెబుతోంది.సౌత్ గ్రూప్, రూ.100 కోట్ల ముడుపులు, గోవా ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేసిన రూ.45 కోట్ల డబ్బుపై ఈడీ దృష్టి సారించింది.
ఈ క్రమంలోనే గోవా ఎన్నికల ఖర్చు( Goa Election Expenditure )లపై ఇప్పటికే గోవా ఆప్ నేత స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డ్ చేసింది.అయితే గోవా ఎన్నికల ఖర్చు వివరాలు తమ వద్ద లేవని, ఆప్ ఢిల్లీ కార్యాలయం నుంచే ఖర్చు లావాదేవీలు జరిగాయని ఆప్ నేత చెప్పినట్లు తెలుస్తోంది.అలాగే కేజ్రీవాల్ సతీమణి ఫోన్ డేటాను కూడా ఈడీ పరిశీలిస్తుంది.
దాంతోపాటుగా కేజ్రీవాల్ స్థిర చరాస్తి వివరాలు, ఐటీఆర్, ఇతర ఆర్థిక వివరాలను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.